ETV Bharat / bharat

ఎర్రకోట ఘటనలో ప్రముఖ ​రైతు నేత అరెస్టు - ట్రాక్టర్​ ర్యాలీ

జనవరి 26న ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు సంబంధించి జమ్ముకశ్మీర్​ రైతు సంఘం ప్రముఖ నేతతో పాటు మరో యువకుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఈ కేసులో కీలక నిందితులని పోలీసులు తెలిపారు.

R-Day violence: Farmer leader from Jammu among 2 arrested by Delhi Police
జమ్ముకశ్మీర్​ కీలక రైతు నేత అరెస్టు
author img

By

Published : Feb 23, 2021, 12:10 PM IST

గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన హింస కేసులో జమ్ముకశ్మీర్​ యునైటెడ్​ కిసాన్​ ఫ్రంట్​ ఛైర్మన్​ మోహిందర్​ సింగ్​, మన్​దీప్​ సింగ్​ అనే యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

జమ్ము నగరానికి చెందిన మోహిందర్​, గోల్​ గుజ్రాల్​కు చెందిన మన్​దీప్​ సింగ్​ ఈ కేసులో కీలక నిందితులని పోలీసులు తెలిపారు. వీరిని దిల్లీ పోలీసు నేరవిభాగం కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్​ పోలీసుల సాయంతో వీరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

మోహిందర్​ సింగ్​కు​ ఈ కేసుతో సంబంధం లేదని ఆయన అమాయకుడని కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని మోహిందర్​ భార్య విజ్ఞప్తి చేశారు. జనవరి 26న ట్రాక్టర్​ ర్యాలీ సమయంలో తన భర్త దిల్లీ సరిహద్దులోని ఆందోళన ప్రదేశంలోనే ఉన్నాడని, ఎర్రకోట వద్ద లేడని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: ఎర్రకోట హింస: 20 మంది అనుమానితుల ఫొటోలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.