ETV Bharat / bharat

కాంగ్రెస్​కు మళ్లీ నిరాశే- ఇలా ఇంకెంత కాలం? - రాహుల్​ గాంధీ

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ డీలా పడింది. గంపెడు ఆశలు పెట్టుకున్న అసోం, కేరళలోనూ అధికారానికి దూరంగా నిలిచిపోయింది. ఇది రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​కు మంచి విషయం కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Questions raised on Congress as the party faced defeat in elections
కాంగ్రెస్​కు తప్పని నిరాశ- భవిష్యత్తు ఏంటి?
author img

By

Published : May 3, 2021, 12:30 AM IST

ఓ ఎన్నిక.. ఓ ఓటమి. మరో ఎన్నిక.. మరో ఓటమి.. కాంగ్రెస్​ పరిస్థితి ఇది. దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర ఉన్న హస్తం పార్టీలో ఓటమి పరంపర కొనసాగుతోంది. మినీ సార్వత్రికంలో.. గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లోనూ ఓడిపోవడం.. కాంగ్రెస ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బ కొట్టే విషయం. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్​ స్థానమేంటి? పార్టీ వైఫల్యాలకు కారణాలేంటి?

ఎన్నికలకు ముందు...

ఈ సారి నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలింది. మిగిలిన బంగాల్​, కేరళ, తమిళనాడు, అసోంలో కాంగ్రెస్​.. ఎన్నికలకు ముందు అధికారంలో లేదు.

ఎన్నికల తర్వాత...

బంగాల్​లో ఆది నుంచి టీఎంసీ-భాజపా మధ్య నువ్వా- నేనా పోటీ నెలకొంది. అయితే ఇక్కడ వామపక్షాలు-ఐఎస్​ఎఫ్​తో కలిసి కూటమిగా బరిలో దిగింది కాంగ్రెస్​. కింగ్​ మేకర్​గా కూటమి ఆవిర్భవిస్తుందని నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ అవేవీ ఫలించలేదు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు కూడా కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్​.

ఇదీ చూడండి:- ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే

తమిళనాడులో డీఎంకేతో కలిసి బరిలో దిగింది హస్తం పార్టీ. ఈ ఒక్క రాష్ట్రంలో పొత్తు వల్ల ప్రభుత్వంలో భాగం కానుంది. అటు పుదుచ్చేరిలో ఓటమి పాలైంది.

ఈ ఎన్నికల్లో కేరళ, అసోంపై కాంగ్రెస్​ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిజానికి.. కాంగ్రెస్​ విజయావకాశాలు కొంత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం సాగించింది. రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. అయిన్నప్పటికీ ఫలితం దక్కకుండా పోయింది. కేరళలో ఎల్​డీఎఫ్​ చారిత్రక విజయాన్ని అందుకోగా.. అసోంలో భాజపా మరింత బలంగా మారింది.

కారణాలేంటి?

బంగాల్​లో వామపక్షాలతో కలిసి బరిలో దిగడం, కేరళలో అదే వామపక్షాలను వ్యతిరేకించడం.. కాంగ్రెస్​కు చేటు చేసింది. సిద్ధాంతాల్లో లోపాలు, బంగాల్​ కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలు పార్టీని కుదిపేశాయి. ఎన్నికల ప్రచారాల్లో కీలక నేతలు పాల్గొనకపోవడం.. అప్పుడే పరిస్థితికి అద్దం పట్టింది.

ఇదీ చూడండి:- 'విజయన్​' ఫార్ములా హిట్- కేరళలో నయా రికార్డ్​

పుదుచ్చేరిలో కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామిని అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేయనివ్వలేదు హస్తం పార్టీ. కొత్త వ్యూహాలతో ఎన్నికల్లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు.

కేరళలో మత్స్యకారులు, అసోంలో టీ కార్మికులను ఆకర్షించేందుకు రాహుల్​ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్​వైపు చూడలేదు.

తర్వాత ఏంటి?

దేశం మొత్తం మీద.. ప్రస్తుతం కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు పంజాబ్​, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​​ మాత్రమే. మహారాష్ట్రలో ప్రభుత్వానికి మద్దతిస్తోంది.

ఇప్పటికే పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. తాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్​కు మరింత చేటు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీకొట్టే విషయంలో రాహుల్​ గాంధీ ఏ మేరకు ప్రభావవంతంగా మారతారన్నది మరింత ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

ఇదీ చూడండి:- సువేందుకు షాక్​- నందిగ్రామ్​లో దీదీ జయకేతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.