ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వంపై 'క్వాడ్' సభ్యదేశాల ప్రతినిధులు చర్చలు జరిపినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రజల శ్రేయస్సును ప్రోత్సహించి, రవాణా, మౌలిక సదుపాయాలు, భద్రత మెరుగుపర్చే విధంగా సభ్యదేశాల అధికారులు చర్చించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సైబర్ భద్రత, తీవ్రవాదాన్ని అణిచివేయడం సహా ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంపై కలిసి పోరాడాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కరోనా టీకా సమర్థత, రక్షణ, వినియోగం వంటి అంశాలు సైతం చర్చకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
చైనా సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పెరుగుతున్న ఆందోళనల మధ్య జరుగుతున్న ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
దక్షిణ చైనా సముద్రంపై
మరోవైపు, దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత పరిణామాలపై క్వాడ్ సమావేశంలో సమీక్ష నిర్వహించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏషియన్ దేశాల కేంద్రంగానే కార్యాచరణ ఉండాలని పేర్కొంది.