ETV Bharat / bharat

'ఇండో-పసిఫిక్​లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర' - క్వాడ్ సదస్సులో స్కాట్ మారిసన్

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు క్వాడ్​ దేశాలు రెట్టించిన ఉత్సాహంతో కలిసికట్టుగా పనిచేయనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం జరిగిన క్వాడ్​ వర్చువల్​ సదస్సులో పాల్గొన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండో-పసిఫిక్​ ప్రాంతాల అభివృద్ధికి సంయుక్తంగా కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్​, జపాన్​ ప్రధాని యొషిహిదె సుగా పిలుపునిచ్చారు.

Quad an important pillar of stability in Indo-Pacific region says PM Modi
'ఇండో-పసిఫిక్ శాంతి, సుస్థిరతలో క్వాడ్ పాత్ర కీలకం'
author img

By

Published : Mar 12, 2021, 9:22 PM IST

Updated : Mar 12, 2021, 9:52 PM IST

ఇండో-పసిఫిక్​ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం క్వాడ్​ దేశాలు మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాంతి నెలకొల్పడంలో క్వాడ్​ దేశాల పాత్ర కీలకమన్నారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంలా భావించే 'వసుదైవ కుటుంబకం' అనే సూత్రాన్ని నమ్ముతానని తెలిపారు.

భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి(క్వాడ్) సదస్సుకు వర్చువల్​గా హాజరై ప్రసంగించారు మోదీ.

క్వాడ్​ దేశాలతో చర్చకు చొరవ చూపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ప్రజాస్వామ్య విలువలతో నాలుగు దేశాలు ఏకమయ్యాయని గుర్తుచేశారు. ఇండో-పసిఫిక్​లో శాంతి, సుస్థితరకు నాలుగు దేశాలు కట్టుబడి ఉంటాయని అన్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభం వంటి కీలక అంశాలపై మాట్లాడారు.

'సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధం'

క్వాడ్​ దేశాలతో సంయుక్తంగా పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇండో-పసిఫిక్​లో సుస్థిరతను నెలకొల్పడమే లక్ష్యమని క్వాడ్​ దేశాల వర్చువల్​ సదస్సులో పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఆచరణాత్మక పరిష్కారాలు వెతకడం వల్ల కూటమికి చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు. మరికొన్ని ఏళ్లపాటు ఈ బంధాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు బైడెన్ పేర్కొన్నారు.

'ఎమోషనల్​గా ఫీలయ్యా'

ఇండో-పసిఫిక్ ప్రాంతాల శాంతి, సుస్థిరతకు జపాన్ సహకారం ముందస్తుగానే ఉంటుందని ఆ దేశ ప్రధాని యొషిహిదె సుగా అన్నారు. క్వాడ్​ సదస్సును ఎమోషనల్​గా ఫీల్​ అయినట్లు పేర్కొన్నారు. కొవిడ్-19 కట్టడికి నాలుగు సభ్య దేశాలు కృషి చేయడం ముఖ్యమని అన్నారు.

2011లో జపాన్​లో భూకంపం సంభవించినప్పుడు క్వాడ్​ దేశాలు చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు సుగా. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రపంచగతిని మార్చే శక్తి'

21వ శతాబ్దంలో ఇండో పసిఫిక్​ ప్రాంతానికి ప్రపంచదేశాల గతిని మార్చేశక్తి ఉందన్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. నాలుగు గొప్ప ప్రజాస్వామ్యదేశాల నాయకులు.. శాంతి, సుస్థిరత, దేశాల శ్రేయస్సు కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

ఇదీ చదవండి:వీరప్ప మొయిలీకి సాహిత్య అకాడమీ పురస్కారం

Last Updated : Mar 12, 2021, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.