ETV Bharat / bharat

పుష్ప ఫేమ్ కేశవ(మచ్చా) అలియాస్ జగదీశ్​పై కేసు నమోదు - పుష్ప ఫేమ్ కేశవ అలియాస్ జగదీశ్​పై కేసు నమోదు

Pushpa Fame Keshava alias Jagadish Case Registered : పుష్ప సినిమాలో అల్లు అర్జున్​తో సహనటుడుగా నటించిన కేశవ(మచ్చా) అలియాస్ జగదీశ్ ఆలీపై పంజాగుట్ట పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాధ్యుడుగా చేస్తూ, మృతురాలి తండ్రి నమోదు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. పంజాగుట్ట పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Young Woman Suicide case on Pushpa Fame Keshava
Pushpa Fame Keshava alias Jagadish Case Registered
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 5:08 PM IST

Updated : Dec 6, 2023, 5:58 PM IST

Pushpa Fame Keshava alias Jagadish Case Registered : పుష్ప సినిమాలో సహనటుడుగా నటించిన కేశవ(మచ్చా) అలియాస్ జగదీశ్ ఆలీపై పంజాగుట్ట పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ యువతి చావుకు జగదీశ్​ కారణమంటూ, మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

బాధిత యువతి షార్ట్ ఫిలిమ్స్ తీసేదని, ఈ క్రమంలో జగదీశ్ పరిచయమై, తన కూతురును మోసం చేశాడని ఫిర్యాదులో యువతి తండ్రి పేర్కొన్నారు. జగదీశ్​ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ ఆర్టిస్ట్) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫోటోలు తీశాడని, ఆ తర్వాత ఆమెను బెదిరించాడని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న జగదీశ్​ను, ఇవాళ అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్​కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

TSRTC employees Protest at bandlaguda RTC Depot : ఆర్టీసీ కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్యపై విచారణకు సిబ్బంది డిమాండ్..

నా చావుకి వారే కారణం - కలచివేస్తున్న దళిత యువకుడు మహేంద్ర వాంగ్మూలం

Last Updated : Dec 6, 2023, 5:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.