ETV Bharat / bharat

పూరీ క్షేత్రంలో వివాదం.. 40 పొయ్యిలు ధ్వంసం - పూరీ ఆలయంలో వివాదం

Puri clay stoves vandalised: పూరీ జగనాథ స్వామి మందిరంలోని వంటశాలలో దుండగులు విధ్వంసం సృష్టించారు! 40 పొయ్యిలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

Puri jagannath temple
Puri jagannath temple
author img

By

Published : Apr 4, 2022, 12:52 PM IST

Puri clay stoves vandalised: ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్​లో ఉన్న మందిర వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వంటశాల ఆవరణలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఈ నేపథ్యంలో ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Puri jagannath temple
పూరీ ఆలయం

విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సేవకులు, భద్రతా సిబ్బందిని వీరు విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూరీ జిల్లా మేజిస్ట్రేట్ సమర్థ్​ బర్మ తెలిపారు. రెండు రోజుల్లోగా దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన పొయ్యిల ద్వారా 15వేల మందికి పైగా భక్తులకు భోజనం తయారు చేయవచ్చు. ఈ గుడిలో రోజూ లక్ష మందికి స్వామివారి భోజన ప్రసాదాన్ని అందిస్తారు.

Puri jagannath temple
వంటశాల!

ఇదీ చదవండి: పబ్​జీ దోస్త్​ ​కోసం 'రైలులో బాంబ్'.. పోలీసులు హడల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.