Man murders girlfriend: బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. పంజాబ్‌లోని సైన్‌పుర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది.. గురుదాస్‌పుర్ జిల్లా సైన్‌పుర్ గ్రామానికి చెందిన పూజ, నిందితుడు రాహుల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల రాహుల్ హత్యాయత్నం చేశాడన్న ఆరోపణలపై జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగివచ్చాడు. అతడికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల పూజ.. బెయిల్‌పై తిరిగి వచ్చిన రాహుల్‌తో పెళ్లికి నిరాకరిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన రాహుల్ అతడి స్నేహితుడి సాయంతో ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ విషయాలను పూజ సోదరి రజని బాలా వెల్లడించింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: 'తాజ్‌మహల్‌లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత