ETV Bharat / bharat

స్వాతంత్య్ర వేడుకల వేళ ఉగ్ర కుట్ర, భగ్నం చేసిన పోలీసులు

Terror Module Punjab స్వాతంత్ర్య వేడుకలకు యావత్​ దేశం సిద్ధమవుతుండగా పంజాబ్​లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ మద్దతుదారుల కుట్రలను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Punjab Police Busted Pak ISI
పంజాబ్​లో ఉగ్ర ముఠా కలకలం
author img

By

Published : Aug 14, 2022, 9:02 PM IST

Terror Module Punjab: స్వాతంత్ర్య వేడుకలకు యావత్‌ దేశం సిద్ధమైన వేళ పంజాబ్‌లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతుదారుల కుట్రలను భగ్నం చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టోళ్లు, 40 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను పంజాబ్-దిల్లీ పోలీసులు సంయక్తంగా నిర్వహించారు.

"స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్‌ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాం. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మద్దతు కలిగిన నలుగురు ఉగ్రవాదులను దిల్లీ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నాం. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం" అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి మూడు హ్యాండ్‌ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టోళ్లు, 40 కాట్రిడ్జ్‌లు సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ పంజాబ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఇవీ చదవండి: జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము, వారిపై ప్రశంసలు

మహారాష్ట్రలో భాజపాకే కీలక శాఖలు, హోం, ఆర్థిక మంత్రిగా ఫడణవీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.