ETV Bharat / bharat

గణతంత్ర వేడుకలకు ముందు పంజాబ్​లో భారీ ఉగ్రకుట్ర భగ్నం - gurdaspur news today

Punjab Terror Attack: గణతంత్ర వేడుకలకు ముందు పంజాబ్​లో భారీ కుట్రకు ప్లాన్ చేశారు కొందరు ఉగ్రవాదులు. ఈ ఉగ్రకుట్రను భగ్నం చేసి.. భారీ మొత్తం ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

explosives
పేలుడు పదార్థాలు
author img

By

Published : Jan 22, 2022, 5:10 AM IST

Punjab Terror Attack: గణతంత్ర వేడుకలకు ముందు పంజాబ్​లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. శుక్రవారం భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను గుర్తించి, వాటిని సీజ్​ చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గుర్​దాస్​పుర్​లో.. ఓ గ్రెనేడ్ లాంఛర్, 3.79 కిలోల ఆర్​డీఎక్స్, 9 డిటోనేటర్లు, 2 సెట్ల టైమర్​ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఉగ్రఅనుచరుడిగా వ్యవహరిస్తున్నాడన్న కారణంగా గజికోట్​కు చెందిన మల్కీత్​ సింగ్​ను గురుదాస్​పుర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసిన నేపథ్యంలో కొందరు ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించినట్లు తెలిసిందని బార్డర్ రేంజ్ ఐజీపీ మోహినిష్ చావ్లా తెలిపారు. ఈ క్రమంలో తనిఖీ నిర్వహించి భారీ మొత్తం పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్​కు చెందిన అంతర్జాతీయ సిక్​ యూత్ ఫెడరేషన్ ఛీఫ్ లఖ్​బీర్ సింగ్ రోడ్​ నుంచి ఈ పేలుడు పదార్థాలు భారత్​కు చేరి ఉంటాయని అన్నారు.

explosives
ఉగ్రకుట్ర భగ్నం
explosives
పంజాబ్​లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గతేడాది నవంబర్- డిసెంబర్​లోను గుర్​దాస్​పుర్​ పోలీసులు రెండు ఉగ్రకుట్రలను భగ్నం చేశారు. పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్లాన్​ను భగ్నం చేసి నలుగురిని అరెస్టు చేశారు. కేజీ ఆర్​డీఎక్స్, 6 చేతి గ్రెనేడ్​లు, టిఫిన్ బాక్స్ ఐఈడీ, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, రెండు పిస్టోల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

భారత్​కు వ్యతిరేకంగా ఫేక్​ న్యూస్​.. 35 పాక్​ యూట్యూబ్​ ఛానళ్లు బ్యాన్​ ​

కేజ్రీవాల్​పై పంజాబ్ సీఎం పరువు నష్టం దావా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.