ETV Bharat / bharat

లేనివి ఉన్నట్లు చూపి రూ 150 కోట్ల స్కాం, విచారణకు ఆదేశించిన సర్కార్​ - పంజాబ్​ రాజకీయాలు

Punjab Scam పంజాబ్ ప్రభుత్వం పెద్ద కుంభకోణం బయటపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్​ సింగ్ హయాంలో రూ 150 కోట్ల కుంభకోణం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కుల్దీప్‌ సింగ్‌ దహిల్వాల్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు.

punjab politics
punjab scam
author img

By

Published : Aug 19, 2022, 7:09 AM IST

Punjab Scam: పంజాబ్‌లోని ఆప్‌ సర్కార్‌ పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన 11వేలకు పైగా పంట అవశేషాల నిర్వహణ యంత్రాలు మాయమైనట్టు గుర్తించింది. గతంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ రూ.150 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని.. ఆ యంత్రాలు ఇచ్చినట్టు కేవలం కాగితాల్లోనే పేర్కొన్నారని పంజాబ్‌ వ్యవసాయశాఖ మంత్రి కుల్దీప్‌ సింగ్‌ దహిల్వాల్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన ఈ యంత్రాలు రైతులకు అందలేదన్న సమాచారంతో క్షేత్రస్థాయి సర్వేకు తాను ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

2018 నుంచి ఈ నెల వరకు రైతులకు అందిన యంత్రాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా.. ప్రభుత్వం మొత్తంగా 90,422 యంత్రాలు కొనుగోలు చేసి సబ్సిడీపై లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు పేర్కొన్నప్పటికీ.. వాటిలో కనీసం 11,275 (12శాతం) యంత్రాలు వారికి అందలేదని గుర్తించారు. ఈ యంత్రాలు కొనుగోలు చేసినట్టు కేవలం పేపర్లపైనే ఉందని వెల్లడించారు. ఇందుకు ప్రధాన బాధ్యత అప్పట్లో వ్యవసాయశాఖ బాధ్యతలు చూసిన మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. వారిద్దరూ స్పందించలేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌తో విచారణకు సంబంధించిన దస్త్రాన్ని తాను సీఎం భగవంత్‌ మాన్‌కి పంపినట్టు మంత్రి వెల్లడించారు. అయితే, ఈ యంత్రాలపై మొత్తం సబ్సిడీ రూ.1200 కోట్లు కాగా.. ఈ వ్యవహారంలో రూ.150 కోట్లు మేర కుంభకోణం జరిగినట్టు తాము అంచనా వేస్తున్నామన్నారు. ఇలాంటి కుంభకోణాలు జరిగితే కేంద్రం నుంచి గ్రాంట్‌లు పొందడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదంతా ప్రజాధనమని.. ఈ స్కామ్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి: మమతతో సుబ్రహ్మణ్య స్వామి భేటీ, ధైర్యవంతురాలంటూ ప్రశంసలు, మోదీపై ఫైర్

కర్రలు, బెల్టులతో విద్యార్థిని చితకబాదిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.