ETV Bharat / bharat

పోలీస్ ఇంటెలిజెన్స్‌ హెడ్​క్వార్టర్స్​పై రాకెట్ దాడి.. వారి పనేనా? - ఇంటిలిజెన్స్​ ఆఫీసు

Punjab Blast: పంజాబ్​ మొహలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్​ ప్రధాన కార్యాలయంలో.. సోమవారం రాత్రి అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఓ భవనం లక్ష్యంగా రాకెట్​ ఆధారిత గ్రనేడ్​ విసిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

author img

By

Published : May 10, 2022, 2:23 AM IST

Updated : May 10, 2022, 8:39 AM IST

Punjab Blast: పంజాబ్​ మొహలీలోని పోలీస్​ నిఘా విభాగం హెడ్​క్వార్టర్స్​పై సోమవారం రాత్రి దాడి జరిగింది. దుండగులు రాకెట్​ ఆధారిత గ్రనేడ్​తో పేలుడుకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. భవనంలోని ఓ అంతస్తులో కిటికీలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. అయితే.. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయనున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు వివరించారు. దాడి వెనుక ఉగ్రకుట్ర దాగి ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పంజాబ్​ డీజీపీతో మాట్లాడిన సీఎం భగవంత్​ మాన్​.. ఘటనపై సమగ్ర నివేదిక కోరారు.

punjab-mohali-intelligence-office-bomb-blast
పోలీస్​ ఇంటెలిజెన్స్​ కార్యాలయంపై దాడి

పోలీస్​ ఇంటెలిజెన్స్​ కార్యాలయంలో పేలుడు

''ఎస్​ఏఎస్​ నగర్​ సెక్టార్​ 77లోని పంజాబ్​ పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో రాత్రి 7.45 గంటల సమయంలో చిన్న పేలుడు సంభవించింది. అయితే.. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. సీనియర్​ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఫోరెన్సిక్​ బృందాలను కూడా పిలిచాం.''

- మొహలీ పోలీసుల ప్రకటన

రంగంలోకి ఎన్​ఐఏ: పేలుడు కేసుపై ఎన్​ఐఏ రంగంలోకి దిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిడానికి దర్యాప్తు బృందం మంగళవారం.. మొహలీకి వెళ్లే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో సమాచారాన్ని రాబట్టేందుకు.. దర్యాప్తు సంస్థకు చెందిన టెర్రర్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ తీవ్రంగా ప్రయత్నిస్తోందని వివరించాయి.

రాకెట్​ ఆధారిత గ్రనేడ్​

కిటికీలు ధ్వంసం
పోలీస్​ నిఘా విభాగం హెడ్​క్వార్టర్స్​ దాడిపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుతో షాక్​కు గురైనట్లు ట్వీట్​ చేసిన పంజాబ్​ మాజీ సీఎం అమరీందర్​ సింగ్​.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భగవంత్​మాన్​ను కోరారు. పంజాబ్​లో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​.

ఇదీ చదవండి: దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!

Last Updated : May 10, 2022, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.