ETV Bharat / bharat

Bike Blast: బైక్​పై వెళ్తుండగానే పేలిన పెట్రోల్​​ ట్యాంక్​! - పంజాబ్ న్యూస్

ఓ వ్యక్తి బైక్​పై ప్రయాణిస్తుండగా వాహనం పెట్రోల్​ ట్యాంక్ (Bike Blast)​ పేలింది. పంజాబ్​లో(Punjab Bike Blast) జరిగిన ఈ ఘటనలో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.

bike blast
పేలిన బైక్
author img

By

Published : Sep 16, 2021, 6:47 PM IST

పేలిన బైక్

ద్విచక్ర వాహనం ఫ్యూయల్​ ట్యాంక్(Bike Blast) పేలి ఓ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పంజాబ్(Punjab Bike Blast) ఫాజిల్కా జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

బుధవారం సాయంత్రం ఫిరోజ్​పుర్​కు చెందిన బల్విందర్​ సింగ్ తన బంధువులను కలిసేందుకు వెళ్తుండగా ద్విచక్రవాహనం పెట్రోల్​ ట్యాంక్(Bike Blast)​ పేలినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు జలాలాబాద్​ ఓల్డ్​ సబ్జీ మండి నుంచి బ్యాంక్​ రోడ్​వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు.

bike
పేలిన ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్

బల్విందర్ బ్యాంక్ సమీపంలోకి చేరుకోగానే ట్యాంక్​ పేలి అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాధితుడిని ఫరీద్​కోట్​ మెడికల్ కాలేజ్​ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అధికారుల బృందం, చండీగఢ్​ ఫోరెన్సిక్​ బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయని పంజాబ్ ఐజీ జితేందర్ సింగ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:Meerut news: 130 రోజుల తర్వాత కొవిడ్‌ నుంచి కోలుకొని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.