ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య - సింఘూ సరిహద్దులో రైతు మృతి

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సింఘూ సరిహద్దు వద్ద ఓ రైతు విషపదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.

Punjab farmer ends life at Singhu border
దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి
author img

By

Published : Jan 10, 2021, 5:14 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ చుట్టుపక్కల సాగుతున్న రైతు ఆందోళనల్లో మరో అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు. సింఘూ సరిహద్దు వద్ద విష పదార్థం సేవించి అమరీందర్​ సింగ్​ (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి రైతులు ఆయనను హరియాణాలోని సోనిపట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ రైతు పంజాబ్‌లోని ఫతేగఢ్​ సాహెబ్‌ జిల్లాకు చెందిన వారు అని పోలీసులు తెలిపారు. నెలన్నరకుపైగా సాగుతున్న దిల్లీలో రైతు ఆందోళనల్లో ఇప్పటికే పలువురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలు మేలే- మమ్మల్ని కక్షిదారులుగా చేర్చండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.