Punjab election result: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జోరుకు అడ్డు లేకుండా పోయింది. కీలక నేతలు, తలపండిన రాజకీయ కురువృద్ధులను 'ఊడ్చేసింది' ఆప్. పంజాబ్ ప్రస్తుతం సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సైతం ఓటమిపాలయ్యారు.
అటు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం చతికిలపడ్డారు. పటియాల నుంచి బరిలో దిగిన ఆయన ఓడిపోయారు.
శిరోమణి అకాళీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం పరాజయం చవిచూశారు. కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు.
సోనూసూద్ సోదరి సైతం..
వితరణశీలి సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సైతం ఓటమి చెందారు. కాంగ్రెస్ తరఫున మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 1977 నుంచి 2017 వరకు ఆ పార్టీ ఇక్కడ ఆరుసార్లు గెలుపొందింది.
ఇదీ చదవండి: పంజాబ్‌లో ఆప్ దూకుడు.. కాంగ్రెస్ బేజారు