ETV Bharat / bharat

'మద్యం మత్తులో సీఎం.. కనీసం నడవ లేక ఇబ్బందులు.. విమానం నుంచి దించివేత!' - పంజాబ్ ముఖ్యమంత్రి జర్మనీ

Punjab CM Lufthansa flight: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​పై సంచలన ఆరోపణలు చేశారు శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్. మద్యం మత్తులో ఉన్న ఆయన్ను.. విమానం నుంచి దించేశారని ట్వీట్ చేశారు. అయితే.. ఇదంతా అసత్యమని ఆప్ ఖండించింది.

PUNJAB CM DRUNK
PUNJAB CM DRUNK
author img

By

Published : Sep 19, 2022, 1:53 PM IST

Updated : Sep 19, 2022, 2:49 PM IST

Punjab CM deplaned: మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ను విమానం నుంచి దించేశారని ఆరోపించారు శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్. శనివారం మాన్​తోపాటు జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు.

"మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్​ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్​ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. అయితే.. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్​ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి" అని ట్వీట్ చేశారు బాదల్.

రాజీనామాకు డిమాండ్
పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సైతం ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్​ది తప్పని తేలితే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని దిల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ పరోక్షంగా కేజ్రీవాల్​, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భగవంత్ మాన్​పై చర్యలు తీసుకుంటారా లేదా అని కేజ్రీవాల్​ను ప్రశ్నించారు.

ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్​కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్​ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాల నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డాయి. 'పంజాబ్​కు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం నిరంతరం పనిచేస్తున్నారని వారు ఓర్వలేకపోతున్నారు. సీఎం షెడ్యూల్ ప్రకారమే తిరిగి వచ్చారు' అని పార్టీ ప్రధాన ప్రతినిధి మాల్విందర్ సింగ్ కాంగ్ తెలిపారు.

Last Updated : Sep 19, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.