ETV Bharat / bharat

సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఫిక్స్ - ఆమ్​ ఆద్మీ పార్టీ

Bhagwant Mann Oath Ceremony: పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​.. ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​తో భేటీ అయ్యారు. ఈనెల 16న జరిగే ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్​ను ఆహ్వానించారు.

bhagwant mann
భగవంత్​ మాన్
author img

By

Published : Mar 11, 2022, 5:14 PM IST

Bhagwant Mann Oath Ceremony: పంజాబ్​ ముఖ్యమంత్రిగా భగవంత్​ సింగ్​ మాన్​ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్​సింగ్​ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్​కలన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కేజ్రీవాల్​కు ఆహ్వానం..

దిల్లీ సీఎం, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​తో భగవంత్​ మాన్​ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్​ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత.. మాన్​ కేజ్రీవాల్​తో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 13న అమృత్​సర్​లో జరిగే రోడ్​షోలో కూడా కేజ్రీవాల్​ పాల్గొననున్నారు.

పంజాబ్​లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్​.. 58,206 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచారు.

ఇదీ చూడండి : 'మోదీజీ.. భ్రమలు వద్దు.. అసలు యుద్ధం 2024లోనే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.