Punjab Assembly Polls Bjp: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో భాజపా కలిసి పోటీ చేయనుంది. దిల్లీలో అమరీందర్ సింగ్తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ భాజపా ఇన్ఛార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
"ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి. సీట్ల పంపిణీ వంటి విషయాలు తగిన సమయంలో చర్చిస్తాం."
-గజేంద్ర సింగ్ షెకావత్, పంజాబ్ భాజపా ఇన్ఛార్జ్
'101శాతం గెలుపు మాదే'
Punjab Lok Congress Bjp alliance: తమ కూటమి పంజాబ్ ఎన్నికల్లో 101శాతం తప్పక గెలుస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపులో సీట్ల పంపిణీ ప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
మరోవైపు.. పంజాబ్లో పటియాలాలోని 22 మంది కార్పొరేటర్లు సహా ఇతర కాంగ్రెస్ నేతలు.. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' కండువా కప్పుకున్నారు. పటియాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో.. అమరీందర్ సింగ్ కుమార్తె బిబా జై ఇందేర్ కౌర్ సమక్షంలో ఈ నేతలంతా ఆ పార్టీలో చేరారు.
![punjab lok congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13935305_plc.jpg)
![punjab lok congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13935305_plc2.jpg)
ఇదీ చూడండి: ఎన్నికల కమిషనర్లతో పీఎంఓ భేటీ- కాంగ్రెస్ ధ్వజం