ETV Bharat / bharat

రచయిత నిర్వాకం.. మోసాలు చేసి.. వాటిని కథలుగా రాసి... - మోసాలు కథలు

పేరుకు అతడో రచయిత.. సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు సన్నిహితుడు! చేసేవేమో మోసాలు... ఆ వ్యక్తి బారిన పడ్డ వారు ఎందరో.. ఆ మోసాల్నే కథలుగా రాయడం మరో విశేషం. అసలు కథేంటంటే?

writer-who-commit-crimes
అనూప్ మనోరే
author img

By

Published : Feb 23, 2022, 3:11 PM IST

మోసాలు చేసి, వాటినే కథలుగా రాస్తూ రచయితగా మారిన వ్యక్తిని పుణె సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా హైప్రొఫైల్ మహిళతో సన్నిహితంగా ఉన్న నిందితుడు అనూప్ మనోరే.. అనేక మంది బడా బాబులను మోసం చేశాడన్నది ప్రధాన ఆరోపణ. కొంత మంది మహిళలు సైతం అతడితో పాటు ఈ మోసాలలో పాలు పంచుకున్నారు. ఓ మహిళను పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

writer-who-commit-crimes
నిందితుడు అనూప్

అసలు కథేంటంటే?

పోలీసుల కథనం ప్రకారం... అనూప్ మనోరే అనే వ్యక్తి.. హిందీ, మరాఠీ, ఇంగ్లిష్​ భాషల్లో కథలు రాసేవాడు. మరాఠీ చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైప్రొఫైల్ మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేశాడు.

writer-who-commit-crimes
నిందితుడు

హైప్రొఫైల్ మహిళలతో లైంగిక సంబంధాల పేరిట పురుషులకు వల వేసేవాడు అనూప్. వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవాడు. బడాబాబుల్ని నమ్మించేందుకు మహిళల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయించేవాడు. ఈ బ్యాంకు ఖాతాల కోసం మరో కుట్రకు తెరతీశాడు అనూప్.

మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని పేపర్లలో అడ్వర్టైజ్​మెంట్​లు ఇచ్చేవాడు. వీటిని చూసి సంప్రదించిన మహిళల వివరాలతో బ్యాంకు ఖాతాలను తెరిచేవాడు. దీనికి బదులుగా ప్రతి నెలా రూ.5 వేలు చెల్లించేవాడు. ఆ ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును మాత్రం తనే తీసుకునేవాడు. ఇలా ఖాతాలు తెరిచిన వారు, లైంగిక సంబంధాల కోసం డబ్బులు జమ చేసినవారినే పాత్రలుగా మలచి.. కథలు రాసేవాడు. ఇలా ఎంతో మంది తమకు తెలియకుండానే అనూప్ కథల్లో పాత్రధారులైపోయారు.

writer-who-commit-crimes
అనూప్ మనోరే

రూ.60 లక్షలను బ్యాంకు ఖాతాలో జమా చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని పుణెకు చెందిన దీపాలీ శిందే(76) అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. పోలీసులు దర్యాప్తు జరపగా.. నిందితుడి బాగోతం గురించి తెలిసింది. గణేశ్ శెలార్ పేరుతో దీపాలీ శిందే ఫిర్యాదు ఇవ్వగా.. పోలీసుల విచారణలో అనూప్ మనోరేనే గణేశ్ అని తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: ఇంట్లోంచి లాక్కొచ్చి ప్రేమికులపై తూటాల వర్షం.. పరువు పేరుతో...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.