మహారాష్ట్ర పుణెకు చెందిన యువాన్ అనే ఏడాది బాలుడు.. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపి(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి వైద్యం అందించాడానికి రూ.16 కోట్లు ఖర్చవుతుంది. బాలుడి తల్లిదండ్రులు అమిత్, రూపాలి రామ్‌తేక్కర్.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆ డబ్బును సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ వ్యాధికి జోల్జెన్స్మా థెరపీ చేయాలి. అయితే ఇలాంటి అరుదైన జన్యు సంబంధిత వ్యాధులకు మన దేశంలో చికిత్స లేదు. విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించాలి. ఇందుకు కావాల్సిన డబ్బును 'క్రౌడ్ ఫండింగ్' రూపంలో సేకరించాలని నిర్ణయించుకున్నారు. 23 రోజుల్లో రూ. 25 లక్షలు సేకరించారు.
ప్రస్తుతం దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువాన్‌కు మూడు నెలల్లోగా ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించారు.
టీరా కామత్ విషయంలోనూ ఇలాగే..
గతంలో ఎస్ఎంఏతో బాధపడిన ముంబయికి చెందిన మూడు నెలల టీరా అనే పాప తల్లిదండ్రులు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారానే రూ.16 కోట్లు సేకరించి వైద్యం అందించారు. అనంతరం ఆ చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఇదీ చూడండి: చిన్నారి వైద్యం కోసం నెటిజన్ల రూ.16 కోట్ల విరాళం
ఏంటీ వ్యాధి?
ఎస్ఎంఏ జన్యు సంబంధిత వ్యాధి. వెన్నముక కండరాలు క్షీణింపచేయడం ఈ వ్యాధి లక్షణం. పిల్లలు మెడ పైకెత్తడం, నడవడం, కూర్చోవడం చేయలేరు. సరిగా పడుకోవడం కూడా ఉండదు. తినేటప్పుడు కండరాలు సహకరించకపోవడం.. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.
ఇదీ చూడండి: పండంటి కిడ్నీకి 12 సూత్రాలు!