ETV Bharat / bharat

'ప్రజల మేలుకే ప్రభుత్వానికి అధికారం' - లైసెన్సులు జారీపై సుప్రీంకోర్టు

లైసెన్సుల జారీలో హరియాణా ప్రభుత్వం అమలు చేసిన 'మొదట వచ్చిన వారికి ముందుగా కేటాయింపు' విధానాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2010లో విడుదల చేసిన ప్రజా నోటీసులోగానీ, 2011లో ఆమోదించిన తుది అభివృద్ధి ప్రణాళికలోగానీ ఎక్కడా ఎఫ్‌సీఎఫ్‌ఎస్‌ గురించి ప్రస్తావించలేదని తెలిపింది.

supreme court news
'ప్రజల మేలుకే ప్రభుత్వానికి అధికారం'
author img

By

Published : Oct 29, 2021, 9:10 AM IST

ప్రజలకు మేలు చేయడం కోసం మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని లైసెన్సుల మంజూరుకు న్యాయబద్ధమైన విధానాన్ని రూపొందించి, దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది. గ్రూపు హౌసింగ్‌ కాలనీల అభివృద్ధి కోసం లైసెన్సుల జారీలో హరియాణా ప్రభుత్వం అమలు చేసిన 'మొదట వచ్చిన వారికి ముందుగా కేటాయింపు' (ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సెర్వ్‌-ఎఫ్‌సీఎఫ్‌ఎస్‌) విధానాన్ని తిరస్కరిస్తూ జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పేర్కొంది. తొలుత పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఇదే విధమైన తీర్పు ఇవ్వగా దాన్ని సవాలు చేస్తూ అప్పీళ్లు వచ్చాయి. వీటిన్నింటిని ధర్మాసనం కొట్టివేసింది. 2010లో విడుదల చేసిన ప్రజా నోటీసులోగానీ, 2011లో ఆమోదించిన తుది అభివృద్ధి ప్రణాళికలోగానీ ఎక్కడా ఎఫ్‌సీఎఫ్‌ఎస్‌ గురించి ప్రస్తావించలేదని తెలిపింది.

''మొదట వచ్చిన వారికి ముందుగా కేటాయింపు.. అన్నది సంప్రదాయంగా మారిందన్న విషయం దరఖాస్తుదారుల అనుభవంలో ఉన్న విషయం. లైసెన్సుల మంజూరు విషయమై 2010 అక్టోబరు ఒకటో తేదీన ప్రకటన వెలువడిన వెంటనే చాలా మంది దరఖాస్తులు సమర్పించడం ప్రారంభించారు. పిచ్చి పరుగుపందెంలో పాల్గొన్న విధంగా వ్యవహరించారు. ప్రాథమికంగా ఈ విధానంలోనే లోపం ఉంది. అదృష్టం ఉన్నవారికే ఈ విధానంలో లైసెన్సు దొరుకుతుంది. అధికార యంత్రాంగంతో సంబంధాలు ఉన్నవారు ముందుగానే సమాచారం తెలుసుకొని అందరికన్నా ముందుగా దరఖాస్తు చేస్తారనేది కొట్టివేయలేని అంశం. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడడానికి ముందే దరఖాస్తు సమర్పించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇదే జరిగింది"

-సుప్రీంకోర్టు

అందువల్ల ఎలాంటి వివక్షకు తావులేని, పారదర్శక విధానాన్ని అనుసరించడం ప్రభుత్వ విధి అని తెలిపింది. అసలు ఏ చట్టం ఆధారంగా 'మొదట వచ్చిన వారికి ముందుగా కేటాయింపు' అన్న విధానాన్ని రూపొందించారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ప్రాతిపదిక ఏమిటని అడిగింది.

ఇదీ చూడండి : 'దేశంలో రైతులపై దాడులు.. ఇంకెన్నాళ్లు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.