ETV Bharat / bharat

Pubg Game Effect one person Died : పబ్జీ ఆడవద్దని అన్నందుకు.. ప్రాణాలు తీసుకున్నాడు!

Young Man Died Due to Online Mobile Games : మొబైల్‌ గేమ్స్‌కి బానిసైన కుమారుడ్ని తండ్రి బెదిరించినందుకు.. ఆ యువకుడు నూతనంగా భావించాడు. ఆ ఆలోచన తన ప్రాణాలు పోయేలా చేశాయి. ఇంతకి ఏమి ఆలోచించాడు? తన తల్లిదండ్రులకి ఎలాంటి సమాధానం ఇద్దామనుకున్నాడు? అసలు తను చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 3, 2023, 8:39 PM IST

Young Man Die due to PUBG Games in Karimnagar : ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడడం వల్ల వాటికి బానిసగా మారి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి కొంత మంది వ్యక్తులు వచ్చేస్తున్నారు. పెద్దవారు ఆడవద్దని చెప్పిన మాటలు వారి మంచికే అని గ్రహించక.. వారినే బెదిరించే స్థితిలో ఉన్నారు. వారు కాసేపు ఆనందం కోసం జీవితాన్ని కోల్పోతున్నారు. మొబైల్‌లో పబ్జి గేమ్ ఆడుకొనే బదులు చదువుకోవచ్చు కదా అని హెచ్చరించిన తల్లిదండ్రులను.. బెదిరించేందుకు ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. దీంతో ఆ యువకుడు చికిత్స పొందుతూ తనువు చాలించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మృతుడు రమేశ్‌
మృతుడు రమేశ్‌

తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : కరీంనగర్‌ జిల్లాలోని రుక్మాపూర్‌కి చెందిన రమేశ్‌ అనే యువకుడు ఇంటర్ పూర్తి చేసి.. జిల్లాలోనే ఓ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో అడ్మిషన్‌ తీసుకున్నాడు. ఇంకా ఇంజినీరింగ్‌ తరగతులు మొదలు పెట్టనందున ఇంట్లోనే ఉంటు ఫోన్‌లో పబ్జి గేమ్‌ ఆడడం మొదలు పెట్టాడు. ఆ గేమ్‌కి బానిసయ్యాడని తెలుసుకున్న తండ్రి అంజయ్య పలుమార్లు.. మొబైల్లో గేమ్స్‌ ఆడవద్దని హెచ్చిరించాడు. ఇదే తంతు వారి ఇంట్లో తరచూ జరిగేది. అయితే బుధవారం ఆ విధంగానే తండ్రి యువకుడ్ని మందలించి వ్యవసాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బాధితుడు తన తల్లిదండ్రులను బెదిరించాలని భావించి.. సొంత గ్రామంలోని కుంట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. దీంతో బాధితుడికి వాంతులు అయ్యాయి.

చివరి నిమిషాల్లో యువకుడు మాట్లాడిన విషయం : ఈ విషయం గమనించిన స్థానికులు బాధితుడి అన్నయ్యకి ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే ఆ యువకుడ్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న తండ్రి ఆస్పత్రికి చేరుకుని కుమారుడితో మాట్లాడాడు. పబ్జీ గేమ్‌ ఆడవద్దని చెప్పినందుకు.. వారిని బెదిరించాలని ఆనుకుని ఈ పురుగుల మందు తాగనని యువకుడు తన తండ్రితో చెప్పాడు. అయితే ఈ పరిస్థితికి చేరుకుంటానని ఊహించలేదన్న విషయం కూడా తెలిపాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ విషయంపై చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Pub G గేమ్​లో పరిచయం.. ఆల్కహాల్​ తాగించి రేప్.. ఆపై న్యూడ్​ వీడియోలతో బ్లాక్ మెయిల్

మొబైల్‌ గేమ్‌ ఆడేవారికి నిపుణుల సలహాలు : మొబైల్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడడం వల్ల యువత పెడదారిన పడుతుందని.. ఈ పరిస్థితి ఎక్కువగా కౌమార దశకి చేరుకున్న యవతలో ఉంటుందని నిపుణుల తెలిపారు. అందువల్ల ఆ వయస్సులో ఉన్న వారిని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, వీలైతే మొబైల్‌కి కాస్త దూరంగా ఉంచాలని సూచనలు ఇచ్చారు. ఆవేశంలో ఏమి చేసినా తిరిగి వెనక్కి తీసుకురాలేమన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.