ETV Bharat / bharat

పబ్​జీ మోజులో.. సొంతింట్లోనే రూ.8లక్షలు చోరీ!

PUBG Addiction: భారత్​లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీ.. వారిని బానిసలుగా మార్చింది. ఆటలో నిమగ్నమై.. సొంత ఇంట్లోనే రూ. 8 లక్షలు కాజేశారు అన్నదమ్ములు. అసలు విషయం తెలిసి వాళ్ల తండ్రి షాకయ్యాడు. తమిళనాడు చెన్నైలో జరిగిందీ ఘటన.

ి
ి
author img

By

Published : Dec 17, 2021, 6:03 PM IST

PUBG Addiction: పబ్​జీ ఆటలో పడి పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దానికి బానిసలుగా మారుతున్నారు. ఇదే ఆట మోజులో పడి సొంత ఇంట్లో నుంచే రూ. 8 లక్షలు కాజేసి మరొకరికి ఇచ్చారు అన్నదమ్ములు. అసలు విషయం తెలిసి వాళ్ల తండ్రి షాకయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు చెన్నైలోని టేనంపేట్​ ప్రాంతానికి చెందిన నటరాజన్​కు ఇద్దరు కుమారులు. 10,12వ తరగతి చదువుతున్నారు. కిరాణా దుకాణం నడిపే నటరాజన్​.. కొత్త ఇల్లు కొందామని రూ. 8 లక్షలు షాప్​లో రహస్యంగా దాచాడు. కొద్దిరోజులకు ఆ డబ్బు మాయమైంది.

పోయిన డబ్బు గురించి అనుమానంతో కుమారులనే పలుమార్లు అడిగాడు నటరాజన్​. చివరకు వాళ్లే తీసినట్లు ఒప్పుకున్నారు.

ఏం చేశారంటే..?

PUBG Addiction 8 Lakhs Stolen: రూ. 8 లక్షలు ఏం చేశారని తండ్రి నిలదీయగా అసలు విషయం చెప్పారా అన్నదమ్ములు. పబ్​జీ బాగా ఆడే తమ 15 ఏళ్ల స్నేహితుడి కనెక్షన్​ కోసం అతడికి ఇచ్చినట్లు తెలిపారు.

దీంతో తన డబ్బు కోసం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు నటరాజన్​.

పోలీసులు నటరాజన్​ కుమారుల స్నేహితుడిని ప్రశ్నించగా.. తన తల్లిదండ్రులకు ఇచ్చినట్లు చెప్పాడు.

తమ కుమారుడితో పబ్​జీ ఆడేందుకు నటరాజన్​ పిల్లలు.. ఎప్పుడూ ఇంటికి వస్తున్న విషయాన్ని గమనించారు రాజశేఖర్​, పుష్పరాణి దంపతులు. ఇష్టమైన ఆహారం కావాలంటే డబ్బులు తీసుకురావాలని పబ్​జీలో నిమగ్నమైన పిల్లలిద్దరినీ ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే రూ. 8 లక్షలు వారికి ఇచ్చినట్లు తేలింది.

ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PUBG banned in India:

వివిధ కారణాల రీత్యా భారత్​లో నిషేధాన్ని ఎదుర్కొన్న పబ్​జీ.. తిరిగి దేశంలో రీ ఎంట్రీ ఇచ్చింది. 'బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా' పేరుతో వచ్చిన ఈ గేమ్​ బీటా వెర్షన్ మోడ్.. జూన్​ 17న యాప్​ స్టోర్​లో దర్శనమిచ్చింది.

నిషేధం ఇందుకే..

చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్​పై భారత ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. వాటిల్లో పబ్​జీ ఒకటి. అయితే పబ్​జీ ప్రత్యక్షంగా చైనా యాప్​ కాదు. చైనా ఆధారిత టెన్​సెంట్​ సంస్థకు పబ్​జీతో సంబంధం ఉండటం వల్ల యాప్​ నిషేధానికి గురైంది. అనంతరం ఆ సంస్థ పబ్​జీ కార్పొరేషన్​ నుంచి తప్పుకుంది.

ఇవీ చూడండి: పబ్​జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!

పబ్​జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?

పబ్​జీ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.