ETV Bharat / bharat

కరోనా టీకా​ బూస్టర్​ డోస్​తో 'హెచ్​ఐవీ'? అసలు నిజం ఇదీ... - PTI fact check

Covid boosters lead to positive HIV test?: కరోనా టీకా బూస్టర్​ డోసులతో హెచ్​ఐవీ ముప్పు పొంచి ఉందా? కొద్దిరోజులుగా సోషల్​ మీడియాలో ఈ తరహా కథనాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. మరి ఇందులో నిజమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

author img

By

Published : Feb 18, 2022, 4:09 PM IST

Covid boosters lead to positive HIV test?: కొవిడ్ టీకా​ బూస్టర్​ డోసులకు, హెచ్​ఐవీకి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు. బూస్టర్​ డోసులు హెచ్​ఐవీకి దారితీస్తాయని కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన వైద్య నిపుణులు అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. ఇది వాస్తవం అనేలా శాస్త్రీయ ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీటీఐ ఫ్యాక్ట్​ చెక్​లో తేలింది.

నోబెల్​ గ్రహీత మృతితో..

Montagnier: 2008లో వైద్యశాస్త్రంలో నోబెల్​ బహుమతిని మరో ఇద్దరితో కలిసి అందుకున్నారు మోంటెగ్నియర్​. ఎయిడ్స్​కు కారణమయ్యే హ్యూమన్​ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్​పై ​(హెచ్​ఐవీ) పరిశోధనలకుగానూ ఆయనను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది. అయితే.. మోంటెగ్నియర్​ ఇటీవల మరణించారు.

అప్పటినుంచి ట్విట్టర్​ వినియోగదారులు సహా ఇతర నెటిజన్లు ఆయనను కోట్​ చేస్తూ.. కొన్ని పోస్ట్​లు చేస్తున్నారు.

HIV infection: 'కొవిడ్​ మూడో డోసు తీసుకున్నవారు.. ఎయిడ్స్​ టెస్టు చేయించుకోండి. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అప్పుడు మీరు మీ ప్రభుత్వంపై దావా వేయండి.'.. ఇది వాటి సారాంశం.

ఇలాంటివి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్​ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్​ చెక్​ చేపట్టింది. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..?

''కొవిడ్​ బూస్టర్​ డోసు తీసుకుంటే హెచ్​ఐవీ టెస్టు ఎందుకు చేయించుకోవాలో నాకు తెలియట్లేదు. ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.''

- ఉపాసనా రాయ్​, సీనియర్​ శాస్త్రవేత్త, సీఎస్​ఐఆర్​- కోల్​కతా

''కొవిడ్​ వ్యాక్సినేషన్​ తర్వాత.. హెచ్​ఐవీ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.''

- నాగసురేశ్​ వీరపు, వైరాలజిస్ట్​, శివ్​ నాడార్​ యూనివర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్​

కొవిడ్​ టీకాలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు.. ప్రభుత్వ సంస్థలు వ్యాక్సినేషన్​కు ముందు, తర్వాత రక్తంలో హెచ్​ఐవీ యాంటీజెన్​ లేదా యాంటీబాడీస్​ క్లినికల్​ ట్రయల్​ స్క్రీనింగ్​ నిర్వహించవచ్చని నాగసురేశ్​ సూచించారు.

ఇవీ చూడండి: దేశంలో కొత్తగా 25,920 కేసులు.. 492 మరణాలు

8 నెలల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.