ETV Bharat / bharat

పీఎస్​యూల్లో కొవిడ్ చికిత్స​ కేంద్రాల ఏర్పాటు!

author img

By

Published : Apr 16, 2021, 7:52 PM IST

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారికోసం తమ అధీనంలో ఉన్న ఆసుపత్రుల్లో లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొవిడ్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఆయా ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని తెలిపింది.

corona
'కరోనా కట్టడిలో పీఎస్​యూలు సహకరించాలి'

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారికోసం తమ అధీనంలో ఉన్న ఆసుపత్రులను లేదా ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్​యూలు) కొవిడ్​ చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేసేలా చూడాలని సూచించింది. అనంతరం ఆయా ఆసుపత్రుల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతూ లేఖ రాసింది.

కొవిడ్​ చికిత్స కేంద్రాలుగా మార్చిన తర్వాత ఆక్సిజన్ సదుపాయం, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్స కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. గతేడాదిలానే ఈసారి కూడా కొవిడ్​పై పోరాటంలో తమకు మద్దతు అందించాలని లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కోరారు.

డీఆర్​డీఓ సారథ్యంలో..

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 250 నుంచి 300 పడకలతో రెండు ఆసుపత్రులను నిర్మించాలని భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ)కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కోరారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలోని వీటిని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఉత్తర్​ప్రదేశ్​లో గురువారం 22,439 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 104 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ

ఇదీ చూడండి:కరోనా భయాలు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.