ETV Bharat / bharat

PSLV: పీఎస్‌ఎల్‌వీ-సి55 రాకెట్ ప్రయోగం విజయవంతం.. నింగిలోకి రెండు విదేశీ ఉపగ్రహాలు

author img

By

Published : Apr 22, 2023, 4:20 PM IST

PSLV- C55 satellites: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

C55 satellites
పీఎస్‌ఎల్‌వీ సి55

PSLV- C55 satellites: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి.. పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ సీ 55 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి ప్రయోగానికి సంబంధించిన కౌంట్​డౌన్ పనులు సుమారు 25.30గంటల పాటుగా కొనసాగాయి.

సింగపూర్ కు చెందిన 741కిలోల బరువు టెలియోస్-2 .16కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశ పెట్టారు. టెలియోస్ -2ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది కాగా... ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పెలోడ్ ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితులు రేయింబవళ్లు కవరేజ్ అందిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. లూమోలైట్ -4ఉపగ్రహం ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సింగపూర్ ఈ నావిగేషన్ సముద్ర భద్రత కోసం ప్రపంచ షిప్పింగ్ కమ్యునిటికీ ప్రయోజనం చేకూర్చనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగంషార్ నుంచి ఈ ఏడాది మూడో పరీక్షను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న ఎస్ఎస్ఎల్వీ-డీ2. మార్చి 26న ఎల్వీఎం-3 ప్రయోగాలు విజయవంతంగా జరిపారు. మూడో ప్రయోగం విజయవంతం చేసేందుకు ఉద్యోగులు అహర్నిశలు శ్రమించినట్లు అధికారులు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ55 అనుసంధానం ఫిబ్రవరి10నుంచి మొదలైందని పేర్కొన్నారు. రాకెట్ అనుసంధానం లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు కీలకభూమిక పోషించిందని వెల్లడించారు. ప్రయోగం నేపథ్యంలో దేశంలోని ఇస్రో కేంద్రాల సంచాలకులు సీనియర్ శాస్త్రవేత్తలు షార్​కు చేరుకోవడంతో సందడిగా మారింది. అంతకు ముందు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఎస్‌ఎల్‌వీ-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

'(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్‌ ప్రయోగం విజయవంతం చేసిన మా బృందానికి శుభాకాంక్షలు. ఈ ప్రయోగం ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. 741కిలోల బరువు టెలియోస్-2 .16కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశ పెట్టాం. టెలియోస్ -2ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది. ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పెలోడ్ ను ఉంచాం. లూమోలైట్ -4ఉపగ్రహం ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశాం.' డాక్టర్ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి55

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.