ETV Bharat / bharat

తండ్రి పోస్టులోకి కూతురు.. కొత్త SIకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించిన నాన్న - ఫాదర్ డాటర్ పోలీస్

తండ్రికి ట్రాన్స్​ఫర్.. అదే స్థానంలో కూతురుకు పోస్టింగ్! ఈ అరుదైన సంఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది. ఇప్పటివరకు తాను పని చేస్తున్న పోలీస్ స్టేషన్​కు ఎస్​ఐగా వచ్చిన కుమార్తెకు స్వయంగా బాధ్యతలు అప్పగించారు ఆమె తండ్రి.

PSI Father Daughter
PSI Father Daughter
author img

By

Published : Jun 21, 2023, 7:00 PM IST

Updated : Jun 21, 2023, 7:47 PM IST

తండ్రి పోస్టులోకి కూతురు.. కొత్త SIకి పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించిన నాన్న

తన స్థానంలో కొత్తగా విధుల్లోకి చేరిన సొంత కుమార్తెకు దగ్గరుండి బాధ్యతలు అప్పగించారు ఓ తండ్రి. ఈ అరుదైన సన్నివేశానికి కర్ణాటక మండ్యలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్​ వేదికైంది. ఇప్పటివరకు ఆ ఠాణాకు సబ్​ఇన్​స్పెక్టర్​గా ఉన్న బీఎస్​ వెంకటేశ్​ బదిలీ కాగా.. ఆ స్థానంలో ఆయన కుమార్తె బీవీ వర్షను ప్రభుత్వం నియమించింది. బుధవారం వర్షకు.. ఆమె తండ్రి వెంకటేశ్​ ఛార్జ్ అప్పగించారు. మండ్య ఎస్​పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఈ సమయంలో తండ్రీకూతుళ్లు భావోద్వేగానికి లోనయ్యారు.

సైన్యం నుంచి పోలీస్ శాఖకు..
వెంకటేశ్​.. తుమకూరు జిల్లా హులియుర్​దుర్గ వాసి. 16 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు. కార్గిల్​ యుద్ధంలోనూ దేశం కోసం పోరాడారు. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక కర్ణాటకకు తిరిగివచ్చారు. పోలీస్ నియామక పరీక్ష రాసి.. మిలటరీ కోటాలో సబ్​ఇన్​స్పెక్టర్​ ఉద్యోగం సాధించారు. మండ్య, మైసూరు, కొడగు, చామరాజనగర్ జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ఏడాదిన్నర నుంచి మండ్య సెంట్రల్​ స్టేషన్​లో ఎస్​ఐగా పని చేస్తున్నారు.

PSI Father Daughter
కూతురికి పుష్పగుచ్చం అందిస్తున్న తండ్రి

తండ్రి బాటలో కుమార్తె..
వెంకటేశ్ కుమార్తె వర్ష ఎంఏ ఎకనామిక్స్ చదివారు. వృత్తి విషయంలో తండ్రి బాటలోనే పయనించారు. పోలీస్ నియామక పరీక్ష రాసి ఎస్​ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2022 బ్యాచ్​లో కలబురిగిలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. మండ్యలో ఏడాదిపాటు ప్రొబేషనరీ ఆఫీసర్​గా పని చేశారు. ఆమెకు తొలి పోస్టింగ్​గా.. తండ్రి వెంకటేశ్​ చేస్తున్న పోలీస్​ స్టేషన్​కు సబ్​ఇన్​స్పెక్టర్​గా నియమించింది ప్రభుత్వం.

మండ్య ఎస్​పీ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న వెంకటేశ్.. బుధవారం వర్షకు అధికారికంగా సెంట్రల్ పోలీస్ స్టేషన్​ ఎస్​ఐ బాధ్యతలు అప్పగించారు. ఈ అరుదైన సన్నివేశాన్ని ఆ ఠాణా సిబ్బంది ఎంతో ఆసక్తిగా తిలకించారు. వెంకటేశ్, వర్ష ఆనందబాష్పాలు రాల్చారు. వ్యక్తిగత జీవితంలో గతంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు.

PSI Father Daughter
కూతురికి పుష్పగుచ్చం అందిస్తున్న తండ్రి

"నేను సైన్యంలో పని చేశాను. అందుకే కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. పిల్లల్ని దగ్గరుండి సరిగా చదివించలేకపోయాను. నా కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో నా భార్యే చదివించింది. ఇప్పుడు ఈ పోస్టులోకి నా కూతురు రావడం ఎంతో సంతోషకరం. అందుకే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి" అని అన్నారు వెంకటేశ్.

'వారి కష్టాలు చూస్తూ పెరిగా'
"చిన్నతనంలో నా తండ్రిని బాగా మిస్​ అయ్యేదాన్ని. మా అమ్మే నన్ను ప్రభుత్వ బడికి పంపింది. నా తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ నేను పెరిగాను. ఇప్పుడు తండ్రి స్థానంలోకి రావడం నాకు సంతోషంగా ఉంది" అని చెప్పారు వర్ష.

Last Updated : Jun 21, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.