ETV Bharat / bharat

స్టేషన్​కు పిలిచి మూత్రం తాగించిన ఎస్సై!

author img

By

Published : May 23, 2021, 1:37 PM IST

కర్ణాటక చిక్కమగళూరులో ఓ పోలీస్​ అధికారి.. తనను స్టేషన్​కు పిలిచి బలవంతంగా మూత్రం తాగించారని ఓ ఎస్సీ యువకుడు ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సైపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఎస్పీ ఆదేశించారు.

PSI called dalit man to station and made him drink urine
'స్టేషన్​కు పిలిచి మూత్రం తాగించారు!'

కర్ణాటక చిక్కమగళూరులోని ముదిగేరే మండలంలో అమానుష ఘటన జరిగింది. గోనిబీదు స్టేషన్​ ఎస్సై.. తనను స్టేషన్​కు పిలిచి చిత్రహింసలు పెట్టి, తనతో మూత్రం తాగించారని ఓ ఎస్సీ యువకుడు ఆరోపించాడు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఎస్పీ ఆదేశించారు.

ఏం జరిగింది?

ఓ మహిళ ఫోన్​కాల్ సంబంధించిన వివాదంలో గోనిబీదు ఎస్సై అర్జున్​.. తనను పోలీస్​ స్టేషన్​కు పిలిపించి చిత్రహింసలు చేశారని, తనతో మూత్రం తాగించారని యువకుడు ఆరోపించాడు. ఈ ఘటనపై ఎస్సీ సంఘాలు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశాయి. మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఎస్పీ అక్షయ్ ఆదేశించారు. ఎస్సై అర్జున్​ను బదీలీ చేశారు.

PSI called dalit man to station and made him drink urine
యువకుడు ఇచ్చిన ఫిర్యాదు

ఇలాంటి ఘటనలు అమానవీయమని కాంగ్రెస్ నేత దినేశ్​ గుండూరావు ట్వీట్​ చేశారు. ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : లాక్​డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.