కొవిడ్-19 వ్యాక్సిన్ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
"కరోనా వైరస్ ఈ శతాబ్దపు అతిపెద్ద మహమ్మారి. దాని నుంచి దేశ ప్రజలను కాపాడటం చాలా ముఖ్యం. కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఉచితంగానే టీకా అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రమే ఖర్చు చేయడం వల్ల.. ఎంతో మంది ప్రాణాలు నిలుస్తాయి."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
అయితే.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తమ ప్రజలందరికీ ఉచితంగానే సరఫరా చేస్తామని దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చదవండి: మోదీ అధ్యక్షతన నేతాజీ 125వ జయంతి ఉత్సవాలు