దేశంలో పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై తనదైన శైలిలో నిరసన తెలిపారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్ర సచివాలయం నుంచి కాళీఘాట్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దీదీనే స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకానొక దశలో మమత స్కూటర్ పైనుంచి కిందపడబోయారు. ఈ క్రమంలో పక్కన ఉన్న భద్రతా సిబ్బంది ఆమె పడిపోకుండా చూశారు. అయినా పట్టువదలని దీదీ కాళీఘాట్ చేరే వరకు నిదానంగా ద్విచక్రవాహనాన్ని నడిపారు.
ముఖ్యమంత్రే స్వయంగా రోడ్డు మీదకు వచ్చి ద్విచక్ర వాహనం నడపడం చూసిన కోల్‌కతా వాసులు సెల్ఫోన్లకు పని చెప్పారు. ఫొటోలు, వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.