గుజరాత్‌లోనూ పలు రైతు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. కేంద్రం నుంచి సరైన స్పష్టత వచ్చేవరకూ రైతు నేతలు ఉద్యమం ఆపే ప్రసక్తేలేదని అన్నారు.
టిక్రి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన మహా పంచాయత్ కార్యక్రమంలో మాట్లాడిన రాకేశ్ టికాయత్.. రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకునేవరకు రైతుల ఉద్యమం ఆగదని వ్యాఖ్యానించారు. అంతవరకూ రైతులు ఇంటికి తిరిగి వెళ్లరని ఉద్ఘాటించారు.
రైతు ఉద్యమం పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ల్లోనే కాకుండా దేశమంతటా జరగనుందని పేర్కొన్నారు టికాయత్. గుజరాత్‌లోనూ మహా పంచాయత్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న కొందరు గుజరాతీలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతు ఉద్యమం సఫలీకృతం కాకుండా రైతు సంఘాలను విడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:పంజాబ్‌లో భూకంపం- 6.1 తీవ్రత నమోదు