మండుటెండలోనూ దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తోన్న రైతుల రక్షణ కోసం, హరియాణా సోనీపత్‌కు చెందిన యువరైతు.. ట్రాక్టర్ ట్రాలీని ఇళ్లుగా మార్చారు. అందులో ఏసీ , ఫ్రిజ్, కూలర్‌ను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా టీవీ, సీసీ కెమెరాలను అమర్చాడు.
వంద రోజులకుపైగా రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!'