Protest For School Reopen: పాఠశాలలను పునఃప్రారంభించాలని పంజాబ్ అంతట స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలను తెరవకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని హెచ్చరించారు. స్కూళ్లను రీఓపెన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఫ్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిరసన తెలిపారు.
"గత ఏడాది తొమ్మిది నెలలు పాఠశాలలు మూసివేశారు. ఈ ఏడాది జనవరి 5 నుంచి అదే పరిస్థితి. విద్యార్థులు, టీచర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది."
-ఎంఏ షఫీ, ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్
"మొబైల్ ఫోన్స్‌లో ఆన్లైన్ క్లాసులతో మా పిల్లల కళ్లు పోతున్నాయి. చదువులపై సరైన ఏకాగ్రత పెట్టడంలేదు. రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీలు భారీగా జరుగుతున్నాయి. మరి.. పాఠశాలలు ఎందుకు మూసివేస్తున్నారు.."
-ఓ విద్యార్థి తండ్రి
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరి 8వరకు పాఠశాలలు మూసివేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటినుంచే విద్యార్థులు ఆన్లైన్లో తరగతులకు హాజరవుతున్నారు.
ఇదీ చదవండి: 'ట్రాఫిక్ సమస్యే చాలా మంది విడాకులకు కారణం'