ETV Bharat / bharat

కాంట్రాక్ట్​ వర్కర్ల నిరసన హింసాత్మకం- 20 మంది పోలీసులకు గాయాలు - ఛత్తీస్​గఢ్​ న్యూస్​

Contract Workers Protest: కాంట్రాక్ట్​ వర్కర్లు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని మండ్వా పవర్​ ప్లాంట్​లో ఈ ఘటన జరిగింది.

Protest by contract workers
Protest by contract workers
author img

By

Published : Jan 2, 2022, 9:30 PM IST

Contract Workers Protest: ఛత్తీస్​గఢ్​ జాంజ్​గిర్​- ఛంపా జిల్లాలోని మండ్వాలో కలకలం రేగింది. అటల్​ బిహారీ వాజ్​పేయీ థర్మల్​ పవర్​ ప్లాంట్​లో కాంట్రాక్ట్​ వర్కర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. 20 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి.

కాంట్రాక్ట్​ వర్కర్ల ఆందోళన హింసాత్మకం

ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర విద్యుత్​ సంస్థ నిర్వహిస్తున్న ప్లాంట్​లోని కాంట్రాక్ట్​ కార్మికులు.. తమను పర్మినెంట్​ చేయాలని కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారిని ఆ ప్రాంతాలనుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు, అధికార యంత్రాంగం. ఇది హింసకు దారితీసింది. నిరసన చేస్తున్న మధుమేహం, బీపీతో బాధపడుతున్న రోగులను తరలించే ఉద్దేశంతో వాటర్​ కెనాన్లు ప్రయోగించారు పోలీసులు. బదులుగా ఆందోళనకారులు.. రక్షక భటులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని ప్రైవేటు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఎస్పీ ప్రశాంత్​ ఠాకుర్​ తెలిపారు.

ఇవీ చూడండి: లా స్టూడెంట్​ దారుణ హత్య- రాడ్లతో కొట్టి, 14 సార్లు కత్తులతో పొడిచి..

60 మేకలు, వందల కిలోల రైస్​తో అదిరే విందు- మహిళలకు నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.