ETV Bharat / bharat

మార్గదర్శిపై వేధింపులకు పాల్పడుతున్నారు.. ప్రధాని మోదీకి జీవీఆర్‌ శాస్త్రి లేఖ - margadarsi chit fund

GVR Shastri Letter to PM Modi: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ఈనాడు పత్రికపై కక్షతో జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శిపై విషం కక్కుతూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడుతోందని.. అఖిలభారత హిందూ మహాసభ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శాస్త్రి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం సుదీర్ఘ లేఖ రాశారు. అందులో మార్గదర్శి సంస్థకున్న ఆర్థిక బలం, నిబద్ధత, 60 ఏళ్లుగా చందాదారులకు అందిస్తున్న సేవల గురించి వివరించారు.

Margadarsi
మార్గదర్శి
author img

By

Published : Apr 10, 2023, 7:56 AM IST

మార్గదర్శిపై విషం కక్కుతోన్న ఏపీ ప్రభుత్వం.. ప్రధాని మోదీకి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శాస్త్రి లేఖ

GVR Shastri Letter to PM Modi: ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రామోజీ గ్రూప్‌పై పగ పెంచుకొని విషం కక్కడానికి ప్రయత్నిస్తోందని.. అఖిలభారత హిందూ మహాసభ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శాస్త్రి ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నిష్పాక్షికంగా పాత్రికేయ విలువలకు కట్టుబడిన ఈనాడు... రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను వెలుగులోకి తెస్తుండటం జగన్‌కు కంటగింపుగా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రామోజీ గ్రూప్‌ సంస్థలపై దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు.

డిపాజిటర్ల రక్షణ పేరుతో మార్గదర్శిని వేధించడం ద్వారా ఈనాడు గొంతు మూయించే కుట్రపన్నారన్న జీవీఆర్‌ శాస్త్రి.. అబద్ధాలు ప్రచారం చేస్తూ లక్షల చందాదారుల్లో భయాందోళనలు రేకెత్తించి.. సంస్థను దెబ్బతీసే కుట్రకు తెరతీశారని లేఖలో తెలిపారు. చిట్‌ఫండ్‌ వ్యాపారానికి వర్తించని చట్టాలు, సెక్షన్లను ప్రయోగించి యాజమాన్యంలోని ప్రముఖ వ్యక్తులను అరెస్టు చేసే కుయుక్తులకు తెరతీశారన్నారు.

1962లో ఏర్పడిన మార్గదర్శి గత ఆరు దశాబ్దాల్లో లక్షల మంది ఆర్థికావసరాలు తీర్చిందన్న జీవీఆర్‌ శాస్త్రి.. ప్రస్తుతం ఈ సంస్థకున్న 71 శాఖల్లో 3వేల మంది ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2 లక్షలమంది చందాదారులతో 7 వేల 219 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌తో పటిష్ఠమైన స్థితిలో ఉన్న ఈ సంస్థపై లేనిపోని ఆరోపణలు చేసి రామోజీరావును దెబ్బతీసేందుకు సీఎం జగన్‌ కుట్రను అమలు చేస్తున్నారన్నారు.

ప్రత్యక్షపన్నుల రూపంలో వెయ్యి 50 కోట్లు, జీఎస్టీ, సర్వీస్‌ ట్యాక్స్‌ రూపంలో 275 కోట్ల రూపాయల వరకు చెల్లించి దేశ నిర్మాణానికి తనవంతు చేయూతనందిస్తున్న సంస్థపై కక్షసాధింపునకు దిగడం మంచిదికాదన్నారు. తనపై చేస్తున్న ప్రతి ఆరోపణకూ సంస్థ వివరణ ఇచ్చి తన నిబద్ధతను చాటుకుంటోందన్న జీవీఆర్‌ శాస్త్రి.. ఇప్పటివరకూ ఖాతాదారులకు పైసా నష్టం చేకూర్చిన సందర్భం లేదన్నారు.

ఖాతాదారులకు సంస్థ చెల్లించాల్సిన మొత్తం 11 వందల 70 కోట్ల రూపాయలు ఉంటే, దాని ఆస్తులు 2 వేల 723 కోట్లు ఉన్నాయన్నారు. ఇలాంటి సంస్థపై లేనిపోని సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి వేధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పత్రికా రంగమే కాకుండా, సినిమా రంగానికి, సమాజానికి విశేష సేవలు అందించిన రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని తాను ఇదివరకే ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని జీవీఆర్‌ శాస్త్రి గుర్తు చేశారు.

అలాంటివారి విషయంలో ఏపీసీఐడీ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న జీవీఆర్‌ శాస్త్రి.. వయోవృద్ధులతో పోలీసులు వ్యవహరించాల్సిన తీరును నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నట్లు తెలిపారు. పోలీసులు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే రాతపూర్వకంగా వివరాలు తెలుసుకోవాలన్నారు. రామోజీరావు లాంటి ప్రముఖులను సీఐడీ పోలీసులు ముఖాముఖి విచారించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఒక వ్యక్తికి ఉన్న పేరు ప్రతిష్ఠలను మసకబార్చడానికి జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని కోరుతున్నట్లు జీవీఆర్‌ శాస్త్రి ప్రధాని మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.