ETV Bharat / bharat

'సెంట్రల్​ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు' - సెంట్రల్ విస్టా

విపత్కర పరిస్థితుల వేళ సెంట్రల్​ విస్టా నిర్మాణం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈ క్లిష్ట సమయంలో కరోనా నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

Priyanka
ప్రియాంక గాంధీ
author img

By

Published : May 10, 2021, 8:16 PM IST

కొవిడ్ పరిస్థితుల్లో సెంట్రల్​ విస్టా(నూతన పార్లమెంటు) నిర్మాణ పనులు కొనసాగించడాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. కరోనా వైద్య పరికరాలు, ఔషధాలపై ఖర్చు చేయాల్సిన సమయంలో నూతన పార్లమెంటు భవనం నిర్మించడం ఏంటని ప్రశ్నించారు.

Priyanka tweet
ప్రియాంక గాంధీ ట్వీట్​

"ప్రధాని నూతన నివాసం, సెంట్రల్‌ విస్టా మొత్తం ఖర్చు = 20వేల కోట్లు = 62 కోట్ల వ్యాక్సిన్లు = 22 కోట్ల రెమ్​డెసివిర్​ వయల్స్ = 3 కోట్ల 10 లీటర్ల ఆక్సిజన్​ సిలిండర్లు = 13 ఎయిమ్స్‌లు (12వేల పడకలతో కూడిన)" అని ప్రియాంక ట్వీట్‌ చేశారు. వెంటనే సెంట్రల్‌ విస్టా పనుల ఆలోచనను విరమించుకోవాలని ప్రియాంక సహా రాహుల్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని కోరారు.

ఇదీ చూడండి: వైద్య సామగ్రిని తీసుకొచ్చిన భారత 'యుద్ధ నౌకలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.