ETV Bharat / bharat

'మహిళాశక్తిని ముందు గుర్తించింది కాంగ్రెస్​ పార్టీనే' - మహిళా సాధికారతపై ప్రియాంక వాద్రా కామెంట్స్​

Priyanka gandhi women power: మహిళా శక్తిని అన్నీ రాజకీయ పార్టీలు విస్శరించాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన 'లడ్కీ హూ, లడ్ సక్తీ హూ' అనే నినాదంతో ఇతర పార్టీలు మేల్కొని.. వారి కోసం మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.

Priyanka
ప్రియాంక గాంధీ వాద్రా
author img

By

Published : Dec 20, 2021, 6:53 AM IST

Priyanka gandhi women power: ప్రత్యర్థి పార్టీలు మహిళలను విస్మరించాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఆరోపించారు. 'యవతిని.. పోరాడగలను' (లడ్కీ హూ, లడ్ సక్తీ హూ) అంటూ కాంగ్రెస్​ పార్టీ నినాదమిచ్చాకే.. విపక్షాలన్నీ మహిళల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. పార్టీలోని మహిళా విభాగం ఏర్పాటు చేసిన 'మహిళా శక్తి సంవాద్​' ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ చూపిన చిన్నపాటి చొరవ ఇతర అన్ని పార్టీల కళ్లు తెరిపించిందన్నారు.

'ఎల్లుండి ప్రధాని ఇక్కడ బహిరంగ సభ పెడుతున్నారు. సభకు మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఆ ఘనత మనదే' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. 'లడ్కీ హూ, లడ్ సక్తీ హూ' అనేది మహిళా శక్తిని నొక్కిచెప్పడానికి ఇచ్చిన నినాదాలలో ఒకటి.

'టెలీ-ప్రాంప్టర్​లో చూసి చదవడమే!'

మోదీ సభ గురించి కూడా ఆమె తన రీతిలో విమర్శలు గుప్పించారు. ఆయన పర్యటన కోసమని సభ జరిగే చోట విస్తృతమైన ఏర్పాట్లను, టెలీ-ప్రాంప్టర్‌ను ఉపయోగించడంపై కూడా దృష్టి సారించారని అన్నారు. ఆ కార్యక్రమ వేదికలు సినిమా సెట్‌ను పోలి ఉంటాయని అన్నారు. వాటిని ఆ రీతిలోనే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రేపు సభకు ప్రధాని వచ్చి నాలుగు సంస్కృత శ్లోకాలు చదువుతారని, అది విన్న ప్రజలు మోదీకి వేద భాష వచ్చని భావిస్తారని అన్నారు. కానీ అలా చదవడానికి నిర్వాహకులు టెలీ-ప్రాంప్టర్ ఉపయోగిస్తారని ప్రియాంక విమర్శించారు.

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇది వరకే ప్రకటించింది.

ఇదీ చూడండి: 'సీఎం నా ఫోన్​ ట్యాప్ చేసి వింటున్నారు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.