ETV Bharat / bharat

'కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు రాజీ లేదు' - లఖింపుర్​ ఖేరి ఘటన

రైతుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్​ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi News) ఆరోపించారు. భాజపా నేతలకు, వారి బిలీనియర్ మిత్రులకు తప్పిస్తే.. దేశంలో ఎవరికీ రక్షణ లేదని విమర్శించారు.

Priyanka news
ప్రియాంక గాంధీ
author img

By

Published : Oct 11, 2021, 6:56 AM IST

Updated : Oct 11, 2021, 9:12 AM IST

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ప్రధాన నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi News)మండిపడ్డారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు ఎలాంటి భద్రత లేదని.. కానీ బిలియనీర్‌ స్నేహితులకు మాత్రం పాలకులు భద్రత కల్పిస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాంగ్రెస్‌ (CONGRESS NEWS) ఆధ్వర్యంలో 'రైతులకు న్యాయం' పేరిట ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ఈ దేశం కొంత మందిది మాత్రమే కాదని, మీ అందరిదని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఈ దేశం ప్రధాని, ఆయన మంత్రులది మాత్రమే కాదు. ఈ దేశం మీది. అప్రమత్తంగా లేకపోతే మీ దేశంతోపాటు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు' అని పేర్కొన్నారు.

లఖింపుర్‌ ఖేరీలోని రైతుల మృతిపై స్పందించని ప్రధాని మోదీ సహా ఇతర నేతలపై ప్రియాంక మండిపడ్డారు. లఖ్‌నవూలో పర్యటించవచ్చు కానీ లఖింపుర్‌ ఖేరీలో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించలేరా? అంటూ ఈనెల 5న లఖ్‌నవూను సందర్శించిన మోదీని ఉద్దేశించి మాట్లాడారు. రైతుల హత్యలో అరెస్టయిన ఆశిష్‌ మిశ్రా తండ్రి, హోం మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని ఈసందర్భంగా డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు కావాల్సింది డబ్బు కాదని, వారికి న్యాయం కావాలని కోరారు.

లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించాలని ప్రియాంకా గాంధీ గతంలోనూ డిమాండ్‌ చేశారు. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నేడు లఖ్‌నవూ చేరుకోనున్న నేపథ్యంలో ప్రియాంక ఓ వీడియో విడుదల చేశారు. నిరసన ప్రదర్శనలో ఉన్న రైతులపై వాహనాలు దూసుకెళ్తున్న వీడియో చూపుతూ.. సంబంధిత మంత్రిని ఇంకా ఎందుకు తొలగించలేదో ప్రధాని దేశవాసులకు సమాధానం చెప్పాలన్నారు. నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదో కూడా తెలపాలని డిమాండ్‌ చేశారు.

మహారాష్ట్రలో బంద్​కు పిలుపునిచ్చిన మహారాష్ట్ర వికాస్​ అఘాడీ

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన హింసాత్మకత ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చింది శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్​ అఘాడీ. మహారాష్ట్ర ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్​కు మద్దతు తెలపాలని కోరింది. ఈ బంద్​కు శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీల నేతలు బంద్​లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గణాన్ని వినిపించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి 12 నుంచి బంద్​ ప్రారంభమవుతుందని ఎన్​సీపీ అధికార ప్రతినిధి, రాష్ట్రమంత్రి నవాబ్​ మాలిక్​ తెలిపారు.

రైతుల మరణాలపై ఆ 'రైతు' మౌనం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధానిని రైతుతో పోలుస్తూ.. కర్షకుల మరణాలపై ఆ రైతు నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని పలు సమస్యలపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, చమురు ధరలు, నిరుద్యోగం, రైతులతోపాటు భాజపా కార్యకర్తల హత్యలు, నిఘా వ్యవస్థలో లోపాలపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు? మిత్రులారా వీటిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో 40 మంది టీచర్లకు సమన్లు.. 400 మంది అనుమానితుల అరెస్ట్​!

Last Updated : Oct 11, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.