దేశంలోని వివిధ విమానాశ్రయాల్లోని వాటాలను అమ్మేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న వార్తలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భాజపా ప్రైవేటీకరణ ప్రణాళికలతో ప్రజలకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఈ నిర్ణయాలతో కొందరు ధనికులకు మాత్రమే లబ్ధిచేకూరుతుందని ట్వీట్ చేశారు.
"(ఈ ప్రభుత్వానికి)ఎలా నిర్మించాలో తెలియదు. ఎలా అమ్మాలో మాత్రమే తెలుసు. ఇది ప్రజలకు నష్టం కలిగించి.. కొద్ది మంది ధనికులకు మాత్రమే లాభం చేకూరుస్తుంది."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
#ఇండియాఅగైన్స్ట్ప్రైవేటైజేషన్ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ వార్తా సంస్థ కథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు రాహుల్.
ఇప్పటికే ప్రైవేటీకరణ జరిగిన దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ విమానశ్రయాల్లోని మిగిలిన తమ వాటాను విక్రయించేందుకు భాజపా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.
ఇదీ చూడండి:- 'కరోనాతో పెను ముప్పు- జాగ్రత్తలతోనే రక్ష'