ETV Bharat / bharat

కానిస్టేబుల్​కు ఫుల్​గా​ మద్యం తాగించి 'ఖైదీ' పరార్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? - ఉత్తర్​ప్రదేశ్​లో పోలీసు​కు మద్యం తాగించిన ఖైదీ

Prisoner Escaped In Agra Uttar Pradesh : కోర్టులో హాజరుపరిచిన ఓ ఖైదీ.. కానిస్టేబుల్​కు పూటుగా మద్యం తాగించి తప్పించుకున్నాడు. దీనికి కారణమైన కానిస్టేబుల్​ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Prisoner Escaped In Agra Uttar Pradesh
Prisoner Escaped In Agra Uttar Pradesh
author img

By

Published : Aug 6, 2023, 7:48 PM IST

Prisoner Escaped In Agra Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​.. ఆగ్రాలో విచిత్ర ఘటన జరిగింది. జైలు నుంచి కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లిన ఓ నిందితుడు.. కానిస్టేబుల్​కు పూటుగా మద్యం తాగించి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ జరిగింది.. సీతాపుర్ జిల్లా నైమిశారణ్య పోలీస్​ స్టేషన్ పరిధిలోని రాంపుర్ గ్రామానికి చెందిన ఫుర్కాన్ అనే వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకొచ్చిన ఇతర ఖైదీలను మళ్లీ జైలుకు తరలించారు. కానీ ఫుర్కాన్​, అతడితో ఉన్న కానిస్టేబుల్ ఉమానాథ్​ శ్రీవాస్తవ తిరిగి జైలుకు వెళ్లలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వీరి కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో స్టేషన్ సమీపంలో కానిస్టేబుల్​ ఉంటున్న అద్దె గది వద్దకు జైలు లాకప్ ఇంఛార్జ్​, పోలీసులతో వెళ్లారు. అక్కడి వెళ్లిన పోలీసులు కంగుతిన్నారు. కానిస్టేబుల్ మద్యం మత్తులో పడి ఉన్నాడు. ఫుర్కాన్​ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో లాకప్ ఇన్​ఛార్జ్​ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.

ఈ విషయమై కానిస్టేబుల్​ను విచారించగా.. మద్యం మత్తు అతడు ఏమీ చెప్పలేదు. దీంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫుర్కాన్​, అతడి సహచరులు కోర్టు వద్ద కానిస్టేబుల్​ను కలిశారని.. మద్యం కొనిస్తానని చెప్పి తప్పించుకోడానికి వారు పథకం రచించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసైన కానిస్టేబుల్.. ఖైదీని తన గదికి తీసుకెళ్లాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఖైదీని పట్టుకోవడానికి మూడు గాలింపు బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసి.. కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. సాయంత్రం 6 గంటల వరకు బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఖైదీ ఆచూకీ లభించకపోవడం వల్ల తూర్పు ఏఎస్పీ నృపేంద్ర కుమార్​ ప్రకటన విడుదల చేశారు.

వాష్​రూమ్​కు వెళ్లొస్తానని చెప్పి దొంగ పరార్

ఆరుగురిలో ఓ నిందితుడు పరారీ.. ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.