ETV Bharat / bharat

జమ్మూకు మోదీ.. రూ.20వేల కోట్లతో అభివృద్ధి పనులు - మోదీ న్యూస్​

PM Visits Jammu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జమ్ముకశ్మీర్​లో పర్యటించనున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి హోదా రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ఆయన.. రూ.20 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

PM Visits Jammu
PM Visits Jammu
author img

By

Published : Apr 24, 2022, 6:42 AM IST

PM Visits Jammu: జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే 370 అధికరణం ఉపసంహరణ తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 'జాతీయ పంచాయతీ రాజ్‌' దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించనున్నారు.

PM Visits Jammu
సాంబా జిల్లాలో ప్రధాని సభకు ఏర్పాట్లు

శుక్రవారం సుంజ్వాన్‌ ప్రాంతంలో ఇద్దరు జైషే-మహమ్మద్‌ తీవ్రవాదుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ప్రధాని భద్రతను అధికారులు మరింత పటిష్ఠం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధిపతి కుల్‌దీప్‌ సింగ్‌ శనివారం సుంజ్వాన్‌ ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ పర్యటించనున్న పల్లీ గ్రామానికి వెళ్లి అక్కడి భద్రతా పరిస్థితినీ సమీక్షించారు. సాయంత్రం మోదీ కశ్మీర్‌ నుంచి నేరుగా ముంబయికు చేరుకుంటారు. అక్కడ లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాస్టర్‌ దీనానాధ్‌ మంగేష్కర్‌ అవార్డును అందుకుంటారు.

  • కశ్మీర్‌ పర్యటనలో మోదీ.. రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ రహదారిని ప్రారంభించనున్నారు.
  • రూ.7,500 కోట్లతో నిర్మించనున్న దిల్లీ-అమృతసర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారితో పాటు.. చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులనూ ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి: పంజాబ్​ సీఎం మరో కీలక నిర్ణయం.. వారికి భద్రత కట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.