PM Modi: అఫ్గానిస్థాన్‌లోని సిక్కు-హిందూ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు.. దిల్లీ 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందించారు. అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావటంపై కృతజ్ఞతలు తెలిపారని పీఎంఓ వెల్లడించింది. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై ప్రధాని మాట్లాడారని పేర్కొంది. సిక్కు సమాజానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.
అలాగే.. గురు గ్రాంత్ సాహిబ్‌ను గౌరవించుకునే సంప్రదాయం ప్రాముఖ్యతను మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది పీఎంఓ. అందులో భాగంగానే అఫ్గాన్ నుంచి గురు గ్రాంత్ సాహిబ్ స్వరూప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా అఫ్గాన్లు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను, తాను కాబుల్ వెళ్లిన సందర్భాన్ని మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది.
-
#WATCH | Prime Minister Narendra Modi met an Afghan Sikh-Hindu delegation at his residence in Delhi, earlier today.
— ANI (@ANI) February 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: PMO) pic.twitter.com/CviHjtyKDR
">#WATCH | Prime Minister Narendra Modi met an Afghan Sikh-Hindu delegation at his residence in Delhi, earlier today.
— ANI (@ANI) February 19, 2022
(Source: PMO) pic.twitter.com/CviHjtyKDR#WATCH | Prime Minister Narendra Modi met an Afghan Sikh-Hindu delegation at his residence in Delhi, earlier today.
— ANI (@ANI) February 19, 2022
(Source: PMO) pic.twitter.com/CviHjtyKDR
గత ఏడాది అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన నిదాన్ సింగ్ సచ్దేవ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
" గురుద్వారా నుంచి తాలిబన్లు నన్ను కిడ్నాప్ చేశారు. భారత గూఢచారులుగా వారు భావించారు. మమ్మల్ని మతం మార్చాలనుకున్నారు. ప్రధాని మోదీకి మా కృతజ్ఞతలు. భారత ప్రభుత్వం చేసిన సాయానికి చాలా సంతోషంగా ఉంది. మాకు కేవలం ఆవాసం, పౌరసత్వం కావాలి. "
- నిదాన్ సింగ్ సచ్దేవ్, అఫ్గాన్ సిక్కు
కాబుల్‌లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు చెప్పారు తరేంద్ర సింగ్. ఆయన 1989లో అఫ్గాన్ నుంచి భారత్ వచ్చి స్థిరపడ్డారు. పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నామని, సీఏఏ, పౌరసత్వాన్ని ఒకే విండో కిందకు తీసుకురావాలనుకుంటున్న మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు సింగ్.
ఇదీ చూడండి: Russia-Ukraine Crisis: 'రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే విపత్తే'!