ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు షిమ్లాలో పర్యటించనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించే గరీబ్ కల్యాణ్ సమ్మేళన్‌లో మోదీ పాల్గొంటారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై.. ప్రజల స్పందన తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో సంభాషించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమం అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఉదయం 9:45 నిమిషాలకు.. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు.. వారికి సంబంధించిన ప్రాంతాల్లో ప్రజా స్పందన తెలుసుకుంటారని పీఎంవో పేర్కొంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ గరీబ్ కల్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొంటారని తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారని వెల్లడించింది.
ఇవీ చూడండి..