ETV Bharat / bharat

భారీగా తగ్గిన పల్స్​ ఆక్సీమీటర్ ధర

కొవిడ్​ మహమ్మారి సమయంలో అత్యవసరంగా మారిన పల్స్​ ఆక్సీమీటర్​, బీపీ మిషన్​, నెబ్యూలైజర్​ వంటి ఐదు వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గాయి. ప్రతిఒక్క వస్తువుపై 88 శాతం వరకు ధరలు దిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Prices of pulse oximeters
తగ్గిన పల్స్​ ఆక్సిమీటర్​, బీపీ మిషిన్ల ధరలు
author img

By

Published : Jul 24, 2021, 3:58 PM IST

Updated : Jul 24, 2021, 6:23 PM IST

కరోనా మహమ్మారి విజృంభణతో అత్యావశ్యకంగా మారాయి పల్స్​ ఆక్సీమీటర్​, బీపీ మానీటరింగ్​ మిషన్​, నెబ్యులైజర్లు. వాటి ధరలు వేలు, లక్షల్లో పలికాయి. అయితే.. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన ఈ పరికరాలను అందుబాటు ధరల్లో ఉంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రేడ్​ మార్జిన్​పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో గత మంగళవారం నుంచి ఈ వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు దిగొచ్చినట్లు పేర్కొంది.

పల్స్​ ఆక్సీమీటర్​, బీపీ మానీటరింగ్​ మిషన్​, నెబ్యులైజర్​, డిజిటల్​ థర్మోమీటర్​, గ్లూకోమీటర్​లపై ట్రేడ్​ మార్జిన్​ను 70 శాతానికి పరిమితం చేయాలని 2021, జులై 13న జాతీయ ఔషధ ఉత్పత్రుల ధరల నియంత్రణ సంస్థ(ఎన్​పీపీఏ) నోటిఫికేషన్​ ఇచ్చినట్లు తెలిపింది.

" డిస్ట్రిబ్యూటర్​ ధరల్లో ట్రేడ్​ మార్జిన్​ను 70 శాతానికి పరిమితం చేశారు. 2021, జులై 23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎంఆర్​పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. దిగుమతి చేసుకున్న పల్స్​ ఆక్సిమీటర్ల ధరలో గరిష్ఠంగా తగ్గినట్లు తెలుస్తోంది. సాధారణ ఆక్సీమీటర్​ (ఫింగర్​ టిప్​) 88 శాతం.. ఇతర కేటగిరీ ఆక్సీమీటర్​ ధరలు 47 శాతం తగ్గాయి. అదే విధంగా బీపీ మిషన్ల ధరలు 83 శాతం దిగొచ్చాయి. నెబ్యులైజర్​, డిజిటల్​ థర్మోమీటర్​ 77 శాతం, గ్లూకోమీటర్ ధర​ 80 శాతం వరకు తగ్గింది. ఈ సవరించిన ఎంఆర్​పీ ధరలు 2021, జులై 20 నుంచే అమలులోకి వచ్చాయి. ఇవి అన్ని బ్రాండ్లకు వర్తిస్తాయి. కచ్చితంగా అమలయ్యేలా చేసేందుకు వాటి వివరాలను రాష్ట్రాల ఔషధ నియంత్రణ విభాగాలకు తెలియజేశాం. "

- కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ.

ఈ ఐదు కీలక వైద్య పరికరాల ట్రేడ్​ మార్జిన్​పై పరిమితులు విధించేందుకు డీపీసీఓ-2013లో పార్యాగ్రాఫ్​ 19 ప్రకారం ప్రత్యేక అధికారాలను వినియోగించింది ఎన్​పీపీఏ. నోటిఫికేషన్​ ప్రకారం సవరించిన ధరలు జులై 20 నుంచి అమలులో ఉంటాయి. కొవిడ్​-19 అత్యవసర పరిస్థితుల్లో వైద్య పరికరాలను అందుబాటు ధరల్లో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్​పీపీఏ తెలిపింది.

ఇదీ చూడండి: 'తగ్గిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు'

Last Updated : Jul 24, 2021, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.