ETV Bharat / bharat

'కరోనా ఇంకా అంతం కాలేదు' - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తాజా

ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం చర్చించి, నిర్ణయం తీసుకునే వేదిక అని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. మరోవైపు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

president ramnath kovind
రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​
author img

By

Published : Aug 14, 2021, 7:56 PM IST

Updated : Aug 14, 2021, 8:20 PM IST

దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ప్రజల శ్రేయస్సు కోసం చర్చించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ఏకైక వేదిక అని చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతీయులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కొవిడ్‌ సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని రామ్​నాథ్​ కోవింద్​ తెలిపారు. వ్యాపారులు, వలసదారులపై కరోనా ప్రభావం పడిందని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

"లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా విపత్తు వేళ కూడా సాగు రంగంలో వృద్ధి చెందింది. కరోనాను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు."

-రామ్​నాథ్​ కోవింద్​, భారత రాష్ట్రపతి.

సులభతర జీవనం, వాణిజ్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు కోవింద్. పెట్టుబడులకు పెద్దపీట వేస్తోందని చెప్పారు.

'సమష్టి కృషి అవసరం..'

రాజ్యాంగ సిద్ధాంతాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. దేశ ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను మనమంతా స్మరించుకోవాలని చెప్పారు.

Last Updated : Aug 14, 2021, 8:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.