ETV Bharat / bharat

రాష్ట్రపతితో మోదీ భేటీ- భద్రతా వైఫల్యంపై ఆందోళన..

author img

By

Published : Jan 6, 2022, 1:16 PM IST

Updated : Jan 6, 2022, 3:30 PM IST

president-ram-nath-kovind
ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపాలపై రాష్ట్రపతి ఆందోళన

13:14 January 06

Modi Meets President: రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలపై మాట్లాడారు. ఈ విషయంపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

''రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పంజాబ్​లో తన పర్యటనలో భద్రతా లోపాలను ప్రధాని స్వయంగా రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు. ఈ అంశంపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.''

- రాష్ట్రపతి సచివాలయం ట్వీట్​

సమావేశం అనంతరం ట్వీట్​ చేసిన మోదీ.. తన గురించి ఆలోచించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశీస్సులు తనకు మరింత బలాన్ని చేకూరుస్తాయని అన్నారు.

వెంకయ్య ఆందోళన..

ప్రధాని మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ అంశంపై మోదీతో ఫోన్​లో మాట్లాడినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై పఠిష్ఠ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

Modi Punjab Rally: పంజాబ్‌ పర్యటనకు బుధవారం వెళ్లిన మోదీకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. తన కాన్వాయ్​ ఫ్లైఓవర్​పై 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ఆకస్మికంగా ర్యాలీని రద్దు చేసుకుని దిల్లీకి తిరుగుముఖం పట్టారు ప్రధాని. ఈ విషయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. పంజాబ్​ ప్రభుత్వంపై భాజపా విమర్శలు గుప్పించింది.

పంజాబ్​ ప్రభుత్వం మాత్రం.. ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తలేదని, దీని వెనుక రాజకీయ ఉద్దేశమూ లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీ. విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని సీఎం పేర్కొన్నారు.

కమిటీ ఏర్పాటు..

ప్రధాని ఫిరోజ్​ పుర్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై.. పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

Last Updated : Jan 6, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.