ETV Bharat / bharat

ఆ ఫ్రెండ్స్​ కోసం రాష్ట్రపతి రైలు ప్రయాణం - రైలు ప్రయాణం

భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. రైలు ప్రయాణం చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని స్వగ్రామానికి వెళ్లి.. అక్కడ తన చిన్ననాటి స్నేహితులు, బంధువులను కలవనున్నారు.

President Kovind train journey
రామ్​నాథ్ కోవింద్ రైలు ప్రయాణం
author img

By

Published : Jun 25, 2021, 6:12 PM IST

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ రైలు ప్రయాణం చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని స్వస్థలానికి దిల్లీ సఫ్దర్​జంగ్​​ నుంచి ప్రత్యేక రైలులో సతీసమేతంగా బయలుదేరారు. గత 15 ఏళ్లలో ఓ రాష్ట్రపతి రైలు ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, రైల్వో బోర్డు ఛైర్మన్​, సీఈఓ సునీత్​ శర్మ.. రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు.

President Kovind train journey
రాష్ట్రపతికి జ్ఞాపికను బహుకరిస్తున్న రైల్వే మంత్రి పియూష్ గోయల్

రాష్ట్రపతి.. తొలుత యూపీలోని కాన్పుర్​, లఖ్​నవూ వెళ్తారు. ఆ తర్వాత జిన్జాక్​, రురా గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పాత మిత్రులు, పాఠశాల స్నేహితులను ఆయన కలవనున్నారు.

President Kovind train journey
అభివాదం చేస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

రాష్ట్రపతి గౌరవార్థం ఈనెల 27న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు యూపీ అధికారులు. అనంతరం 28న కాన్పుర్​ నుంచి లఖ్​నవూ చేరుకుంటారు. లఖ్​నవూలో రెండు రోజుల పర్యటన తర్వాత దిల్లీ బయలుదేరుతారు.

President Kovind train journey
రైలు ఎక్కుతున్న రాష్ట్రపతి కోవింద్

ఇదీ చూడండి: రాష్ట్రపతి రైలు ప్రయాణం- 15 ఏళ్లలో తొలిసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.