ETV Bharat / bharat

రైతుల మేలు కోసమే సాగు చట్టాలు: రాష్ట్రపతి - President Ram Nath Kovind news latest

మూడు సాగు చట్టాలను రైతుల మేలు కోసమే తీసుకొచ్చామని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ చెప్పారు. రిపబ్లిక్​ డే రోజు ట్రాక్టర్​ ర్యాలీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్​. కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో భారత్‌ ప్రపంచం ముందు శక్తిమంతమైన దేశంగా నిలిచిందన్నారు.

President Ram Nath Kovind addressed the Parliament ahead of budget session
రైతుల మేలు కోసమే సాగు చట్టాలు: రాష్ట్రపతి
author img

By

Published : Jan 29, 2021, 11:37 AM IST

Updated : Jan 29, 2021, 12:40 PM IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రసంగించారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సవాళ్లను దేశం ఎదుర్కొందన్నారు. దేశ రైతుల ప్రయోజనం కోసమే 3 సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మద్దతు ధరలు పెంచుతోందని చెప్పారు.

రైతుల మేలు కోసమే సాగు చట్టాలు: రాష్ట్రపతి

ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదని ఆత్మనిర్భర్‌ భారత్‌ తీసుకొచ్చాం. భారత్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్ కూడా అడ్డుకోలేదు. రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13 వేల కోట్లు బదిలీ చేశాం. నూతన సాగు చట్టాలు రైతుల హక్కులకు భంగం కలిగించవు. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయి. విస్తృత చర్చల తర్వాతే సాగు చట్టాలను పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి.

- రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

రిపబ్లిక్​ డే రోజు రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని కోవింద్​ అన్నారు.

ఇదీ చూడండి: 'నేను విచారణకు హాజరవుతా.. కానీ'

Last Updated : Jan 29, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.