ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

పలు రాష్ట్రాల ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షల తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, హరియాణా గురించి వివరిస్తూ ట్వీట్లు చేశారు.

President Kovind and PM Mod
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 1, 2021, 11:10 AM IST

పలు రాష్ట్రాల అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్​గఢ్, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్​ రాష్ట్రాలు సహా సహా కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్​, పుదుచ్చేరిలకు ట్విట్టర్​ వేదికగా ఆయా రాష్ట్రాలు సాధించిన ఘనతను గుర్తు చేస్తూ.. ట్వీట్లు చేశారు ప్రధాని మోదీ.

formation day of various states
ఆయా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ట్వీట్​

ఆంధ్రప్రదేశ్​ ప్రజలు నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలతో రాణిస్తున్నారని మోదీ అభినందించారు.

formation day of various states
ఆంధ్రప్రదేశ్​ను ఉద్దేశిస్తూ మోదీ ట్వీట్

"రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను."

- ప్రధాని నరేంద్ర మోదీ

formation day of various states
కేరళను ఉద్దేశిస్తూ మోదీ ట్వీట్

దేశ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతోన్న కేరళ ప్రజలకు 'కేరళ పిరవి దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రకృతి అందాలకు కేరళ నిలయంగా ఉందని గుర్తుచేశారు. కేరళ ప్రజలు శ్రమజీవులని.. వారు చేసే పయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

formation day of various states
కర్ణాటకను ఉద్దేశిస్తూ మోదీ ట్వీట్

కర్ణాటక ప్రజలకు 'రాజ్యోత్సవ' శుభాకాంక్షలు తెలుపుతూ.. మోదీ ట్వీట్​ చేశారు. ప్రజల నైపుణ్యంతో రాష్ట్రం ఎంతో ఎత్తుకు ఎదుగుతోందని పేర్కొన్నారు.

పుష్కలంగా సహజ వనరులు ఉన్న మధ్యప్రదేశ్​.. వివిధ రంగాల్లో ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని ట్వీట్​ చేశారు. అది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఛత్తీస్​గఢ్ భిన్నమైన సంస్కృతికి నిదర్శనమని కొనియాడిన మోదీ.. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న హరియాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

ఇదీ చూడండి: ప్రతి ఇంటిపై ఓ కళాఖండం.. ప్రత్యేక ఆకర్షణగా గ్రామం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.