ETV Bharat / bharat

'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం - జీఎన్​సీటీడీ బిల్లు

లెఫ్టినెంట్​ గవర్నర్​కు​ అధిక అధికారాలు కల్పించే.. 'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

President gives assent to bill that says 'government' in Delhi means 'Lieutenant Governor'
'దిల్లీ' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
author img

By

Published : Mar 29, 2021, 5:19 AM IST

ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన దిల్లీ సర్కారు కన్నా దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు అధిక అధికారాలు కల్పించే.. జాతీయ రాజధాని ప్రాదేశిక సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్​ ద్వారా వెల్లడించింది.

'దిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్​ గవర్నర్' ​బిల్లును గతవారం పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ వ్యతిరేకించగా.. దిల్లీ ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణను తీసుకువచ్చామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'అమిత్​ షా-పవార్​ల మధ్య భేటీ జరగనేలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.