నాలుగు కార్మిక స్మృతులకు సంబంధించిన నిబంధనలను కేంద్ర కార్మిక శాఖ సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే నోటిఫై చేసి.. అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో సంస్కరణలకు మార్గం సుగమం కానుంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, అక్యుపేషనల్ భద్రత, ఆరోగ్యం, పని నిబంధనలకు సంబంధించిన స్మృతులను రాష్ట్రపతి ఆమోదించిగా.. వాటిని ఇప్పటికే నోటిఫై చేశారు.
ఈ స్మృతులు అమలు చేయాంటే.. నిబంధనలను కూడా నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నాలుగు స్మృతులకు సంబంధించిన ముసాయిదా నిబంధనలపై కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. నోటిఫికేషన్ కోసం వాటిని సిద్ధం చేసింది.
"నాలుగు స్మృతులకు సంబంధించిన నిబంధనలు రూపొందించాం. నోటిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని నిర్ధరించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తిచేసే పనిలో రాష్ట్రాలు ఉన్నాయి" అని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వెల్లడించారు.
ఇదీ చూడండి: వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి